భూముల విలువ పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్: 30 నుండి 35 శాతం వరకు పెరగనునన్న ధరలు

By narsimha lodeFirst Published May 31, 2023, 2:25 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్రంలో భూముల పెంపునకు   గ్రీన్ సిగ్నల్  లభించింది


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  రాష్ట్రంలో భూముల  ధరల పెంపుదలకు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.  గత  ఏడాది భూమి విలువ పెంచిన  కొత్త జిల్లాల్లో  కాస్త తక్కువగా భూముల ధరలను పెంచింది  ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే  20 శాతం గ్రామాల్లో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  రాష్ట్ర ప్రభుత్వం  తాజాగా  తీసుకున్న నిర్ణయంతో  30 నుండి  35 శాతం వరకు  భూముల విలువ పెరగనుంది. 

.జూన్  1వ తేదీ నుండి రాష్ట్రంలో  భూముల విలువ పెరగనుందని  ప్రచారం సాగుతుంది. ఈ మేరకు  ప్రభుత్వ వర్గాలు  ఇవాళ  నిర్ణయం తీసుకున్నాయి. జూన్  1వ తేదీ నుండి  భూముల విలువ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో  గత రెండు మూడు  రోజులుగా  రాష్ట్రంలోని  రిజిస్ట్రేషన్ల  కోసం  పెద్ద ఎత్తున  ధరఖాస్తులు వస్తున్నాయి. దీంతో  రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో  సేవలు నిలిచిపోయాయి.

 సాంకేతిక సమస్యలు నెలకొనడంతో  రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.  రెండు  రోజులుగా  రాష్ట్రంలో  రిజిస్ట్రేషన్ల ప్రక్రియ  నిలిచిపోయింది.  రాష్ట్రంలోని  295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే  పరిస్థితి నెలకొంది.  దీంతో ఇవాళ్టి నుండి మ్యాన్యువల్ గా  రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది.  రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాంకేతిక  సమస్యలను పరిష్కరించనున్నట్టుగా ప్రభుత్వం  తెలిపింది

 భూముల ధరలు పెరగడంతో  రిజిస్ట్రేషన్ స్టాంప్  డ్యూటీ కూడ పెరగనుంది.  స్టాంప్ డ్యూటీ పెరగడంతో  భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం  పెరిగే  అవకాశం ఉంది. 

click me!