Published : Feb 28, 2025, 09:35 AM ISTUpdated : Feb 28, 2025, 12:24 PM IST

Andhra Padesh Budget 2025 హైలైట్స్, కీ పాయింట్, శాఖలవారిగా కేటాయింపులు

సారాంశం

Andhra Pradesh Budget 2025కి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ పేజీ ఇది. ఇక్కడ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం, అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రసంగంలోని లోని హైలైట్స్, కేటాయించిన నిధుల గురించి తెలుసుకొండి.  
 

Andhra Padesh Budget 2025 హైలైట్స్, కీ పాయింట్, శాఖలవారిగా కేటాయింపులు

12:24 PM (IST) Feb 28

ఏపీ బడ్జెట్స్ 2025లో ఏ శాఖ, ఏ పథకానికి ఎన్ని నిధులు...

ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025-26 : రూ.3.22 లక్షల కోట్లు 

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ 2025-26 : రూ. రూ.48 వేల కోట్లు

శాఖలు, విభాగాల వారిగా కేటాయింపులు : 

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ - రూ.18,848 కోట్లు

పురపాలక శాఖ - రూ.13,862 కోట్లు

పాఠశాల విద్యాశాఖ - రూ.31,806 కోట్లు

బీసీ సంక్షేమం - రూ.23,260 కోట్లు

వైద్యారోగ్య శాఖ - రూ.19,265 కోట్లు

జలవనరుల శాఖ - రూ.18,020 కోట్లు

ఇంధన శాఖ - రూ.13,600 కోట్లు

రవాణాశాఖ - రూ.8,785 కోట్లు

సాంఘిక సంక్షేమం - రూ.10,909 కోట్లు 

ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంక్షేమానికి - రూ.10,619 కోట్లు

అమరావతి నిర్మాణం - రూ.6,000 కోట్లు

రోడ్ల నిర్మాణం, మరమ్మతులు - రూ.4,220 కోట్లు

పోర్టులు, ఎయిర్‌పోర్టులు - రూ.605 కోట్లు

ఆర్టీజీఎస్‌కు - రూ.101 కోట్లు

NTR భరోసా పెన్షన్‌ ‌- రూ.27,518 కోట్లు

ఆదరణ పథకం ‌- రూ.1000 కోట్లు

మనబడి పథకం - రూ.3,486 కోట్లు

తల్లికి వందనం - రూ.9,407 కోట్లు

దీపం 2.O పథకం - రూ.2,601 కోట్లు

బాల సంజీవని పథకం - రూ.1,163 కోట్లు

చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు - రూ.450కోట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు ‌- రూ.3,377కోట్లు

స్వచ్ఛ ఆంధ్రకు - రూ.820 కోట్లు

ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు - రూ.400 కోట్లు

అన్నదాత సుఖీభవ పథకం ‌- రూ.6,300 కోట్లు

ధరల స్థిరీకరణ నిధి - రూ.300 కోట్లు

సాగునీటి ప్రాజెక్టులకు ‌- రూ.11,314 కోట్లు

జల్‌జీవన్‌ మిషన్‌కు - రూ.2,800 కోట్లు

రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన ‌‌- రూ.500 కోట్లు


 
 

11:55 AM (IST) Feb 28

ఎన్టిఆర్ జలసిరి

ఎన్టిఆర్ జలసిరికి రూ.50 కోట్లు కేటాయింపు 
 

11:55 AM (IST) Feb 28

ఉపాధి హమీ పథకం

ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ అనుబంధ రంగాల పనుల కోసం రూ.6,026 కోట్లు కేటాయింపు  

11:54 AM (IST) Feb 28

వ్యవసాయ విశ్వవిద్యాలకు నిధులు

ఆచార్య ఎన్జి రంగ  విశ్వవిద్యాలయానికి రూ.507 కోట్లు, వైస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం రూ.98 కోట్లు,వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి రూ.154 కోట్లు,ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయానికి రూ.38 కోట్లు కేటాయింపు. 


 

11:51 AM (IST) Feb 28

మత్స్య శాఖ

చేపలు, రొయ్యల సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. 

మత్స్యకార కుటుంబాలకు వేట నిషేద కాలంలో రూ.20 వేలు అందిస్తాం. ఇందుకోసం రూ.245 కోట్లు కేటాయింపు. 

చేపల వేటకు వెళ్లి మరణించినవారిక కుటుంబాలకు రూ.3.1 కోట్ల ఎక్స్ గ్రేషియా బకాల చెల్లింపు. ఇందుకోసం రూ.8 కోట్లు కేటాయింపు. 

మత్యరంగ అభివృద్దికి మొత్తంగా రూ.540కోట్లు కేటాయింపు 

11:45 AM (IST) Feb 28

పశు సంవర్ధక శాఖ :

పశు సంవర్ధక శాఖకు బడ్జెట్ 2025 లో రూ.1112 కోట్లు కేటాయింపు 

11:38 AM (IST) Feb 28

వ్యవసాయ మార్కెట్లు

ధరల స్థిరీకరణకు రూ.300 కోట్లు కేటాయింపు. మిర్చి పంటకు క్వింటాక్ రూ.11 వేలకు పైగా ధర నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితోనే ఈ ధర వచ్చింది. 

11:37 AM (IST) Feb 28

పట్టు పరిశ్రమ

పట్టు పరిశ్రమ రూ.96 కోట్లు కేటాయించారు. దేశంలోనే పట్టు పరిశ్రమలో ఆంధ్ర ప్రదేశ్ ది రెండో స్థానం.
 

11:36 AM (IST) Feb 28

ఉద్యాన శాఖకు 930 కోట్లు కేటాయింపు

రాష్ట్రీయ కృషి యోజనకు రూ.500 కోట్లు 

MIDH పథకానికి రూ.179 కోట్లు 

ఫామాయిల్ సాగుకు  179 కోట్ల

వెదురు అభివృద్దికి రూ.2.50 కోట్లు


 
 

11:25 AM (IST) Feb 28

విత్తన రాయితీ బకాయిలు చెల్లింపు

గత ప్రభుత్వం రూ.120 కోట్లు విత్తన రాయితీ బకాయిలు పెండింగ్ లో పెడితే చెల్లించామని... ఇంకా రూ.100 కోట్ల బకాయిలు వున్నాయి... వాటిని కూడా చెల్లిస్తామని తెలిపారు.  
 

11:25 AM (IST) Feb 28

అన్నదాత సుఖీభవ

అన్నదాత సుఖీభవకు రూ.9,400 కోట్లు కేటాయింపు... రైతులకు పెట్టుబడి సాయం పథకం

11:22 AM (IST) Feb 28

వ్యవసాయ యాంత్రీకరణ

వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.219 కోట్లు కేటాయింపు 

11:18 AM (IST) Feb 28

రూ.40  వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్

రూ.48 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ 2025 ను రూపొందించింది ఏపీ ప్రభుత్వం. దీన్ని అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడుతున్నారు. 
 

11:05 AM (IST) Feb 28

మూలధన వ్యయం

ఆదాయాన్ని అందించే భారీ ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టడమే మూలధన వ్యయం. నీటి పారుదల ప్రాజెక్టులు వంటివాటిపై పెట్టే ఖర్చు మూలధన వ్యయం కిందకు వస్తుందన్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టు రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్థిక మంత్రి తెలిపారు. 

 

11:04 AM (IST) Feb 28

తెలుగు బాషకు కేటాయింపులు

తెలుగు బాషాభివృద్ది రూ.10 కోట్లు కేటాయింపు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు రూ. 10 కోట్లు కేటాయింపు 

10:59 AM (IST) Feb 28

పోలీస్ శాఖ

హోంమంత్రిత్వ శాకకు రూ.8570 కోట్లు కేటాయింపు  

10:57 AM (IST) Feb 28

పర్యాటక,క్రీడా శాఖ

యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు కేటాయింపు 

10:56 AM (IST) Feb 28

రవాణా, రోడ్లు భవనాల శాఖ :

రవాణా, రోడ్లు భవనాల శాఖ శాఖకు రూ.8785 కోట్ల కేటాయింపులు 

10:55 AM (IST) Feb 28

ఇంధన రంగం

బడ్జెట్ 2025 బడ్జెట్ లో రూ.13,600 కోట్లు కేటాయింపులు 

10:54 AM (IST) Feb 28

పరిశ్రమల శాఖ

ప్రతి కుటుంబంలో వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకు

పరిశ్రమల శాఖకు రూ.3,156 కోట్ల కేటాయింపులు 

10:51 AM (IST) Feb 28

జలవనరుల శాఖకు రూ.18 కోట్లు

జలవనరుల శాఖకు ఈ బడ్జెట్ లో రూ.18,019 కోట్లు కేటాయింపు. పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు కేటాయింపు

10:47 AM (IST) Feb 28

పట్టణాభివృద్ది శాఖకు రూ.13,862 కోట్లు

పట్టణాభివృద్ది, పురపాలక శాఖకు ఈ బడ్జెట్ లో రూ. 13,862 కోట్లు కేటాయించారు. 

 గృహ నిర్మాణ శాఖకు రూ. 6,318 కోట్లు 


 

10:42 AM (IST) Feb 28

పవన్ కల్యాణ్ శాఖకు భారీగా కేటాయింపులు

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు రూ.18,842 కేటాయించారు. 
 

10:38 AM (IST) Feb 28

విద్యాశాఖకు భారీగా కేటాయింపులు

పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తాం. రూ.31,805 వేల కోట్లు విద్యా శాఖకు కేటాయింపు. రూ.2.506 ఉన్నత విద్యాశాఖకు కేటాయింపులు. తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయింపు 

10:36 AM (IST) Feb 28

బిసి , ఎస్సి సంక్షేమానికి భారీగా నిధులు

బిసి సంక్షేమానికి  రూ.47, 456 కోట్లు కేటాయింపు 

ఎస్సీ సంక్షేమానికి 20,281 కోట్లు 
 

10:25 AM (IST) Feb 28

ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లు

ఆంధ్ర ప్రదశ్ వార్షిక బడ్జెట్ రూ.3,22,359 కోట్లు

ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు

10:25 AM (IST) Feb 28

పౌర సరఫరాల శాఖ భారీ కేటాయింపులు

పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్ లో రూ.3,806కోటు కేటాయింపు 
 

10:22 AM (IST) Feb 28

వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయింపులు

వ్యవసాయ రంగం పథకాల కింద చెల్లించాల్సిన 5 వేల కోట్లకు పైగా గత ప్రభుత్వం చెల్లించలేదు. డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని తిరిగి ప్రారంభించాం. డ్రిప్ ఇరిగేషన్ దేశానికి తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు. 

వ్యవసాయ శాఖకు రూ.13,487 వేల కోట్లు కేటాయింపు 

10:17 AM (IST) Feb 28

అధికారంలోకి వచ్చాక నెరవేర్చిన హామీలివే

పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటిన్లు, ఉచిత సిలిండర్లు, అర్చకులు, ఇమామ్,మౌజమ్ ల గౌరవవేతనం, టీచర్లు నియామకాలు చేపట్టామని తెలిపారు. 
 

10:15 AM (IST) Feb 28

ఏపీ బడ్జెట్ 2025 ప్రసంగాన్ని ఇక్కడ లైవ్ లో చూడండి

10:10 AM (IST) Feb 28

ఏపీ బడ్జెట్ 2025 ప్రసంగం ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025 ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు.జపాన్ అణుబాంబు దాడి తర్వాత ఎలా పురోగతి చెందిందో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కూడా అలాగే అభివృద్ది దిశగా అడుగులు వేస్తోందన్నారు. 

09:38 AM (IST) Feb 28

బడ్జెట్ 2025 కి కేబినెట్ ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ 2025-26 కి కేబినెట్ ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి బడ్జెట్ 2025కి ఆమోదం తెలిపింది. దీంతో ఈ బడ్జెట్ ను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెడతారు. 

 


More Trending News