అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.

01:13 PM (IST) Mar 16
నీటి వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయింపు
01:10 PM (IST) Mar 16
వైఎస్సార్ జలకళకు రూ.252 కోట్లు కేటాయింపు
01:07 PM (IST) Mar 16
వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5,500 కోట్లు కేటాయింపు
01:04 PM (IST) Mar 16
మత్స్య శాఖకు రూ.500 కోట్లు కేటాయింపు
01:00 PM (IST) Mar 16
పశుసంవర్ధక శాఖకు రూ.1114 కోట్లు కేటాయింపు
12:54 PM (IST) Mar 16
శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.138 కోట్లు కేటాయింపు
12:53 PM (IST) Mar 16
డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.102 కోట్లు కేటాయింపు
12:52 PM (IST) Mar 16
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ. 472 కోట్లు కేటాయింపు
12:49 PM (IST) Mar 16
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.286 కోట్లు కేటాయింపు
12:48 PM (IST) Mar 16
వ్యవసాయ సహకార రంగానికి రూ.233 కోట్లు కేటాయింపు
12:43 PM (IST) Mar 16
వ్యవసాయ మౌళిక సదుపాలయ నిధి పథకం రూ.53 కోట్లు కేటాయింపు
12:40 PM (IST) Mar 16
వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ.513 కోట్లు కేటాయింపు
12:37 PM (IST) Mar 16
పట్టు పరిశ్రమ రూ.99 కోట్లు కేటాయింపు
12:36 PM (IST) Mar 16
ఉద్యావన శాఖకు రూ.656 కోట్లు కేటాయింపు
12:28 PM (IST) Mar 16
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం... ఆర్బికేల ద్వారా 10 వేల డ్రోన్ల పంపిణీకి చర్యలు... ఇందుకోసం రూ.80 కోట్లు కేటాయింపు
12:27 PM (IST) Mar 16
రైతు యాంత్రీకరణకు రూ.400 కోట్లు కేటాయింపు
12:26 PM (IST) Mar 16
రైతుల ఎక్స్ గ్రేషియా కోసం రూ.20 కోట్లు
12:26 PM (IST) Mar 16
ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ కోసం రూ.37.39 కోట్లు కేటాయింపు
12:25 PM (IST) Mar 16
వైఎస్సార్ పొలం బడికి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.13.33 కోట్లతో శిక్షణ
12:23 PM (IST) Mar 16
ప్రకృతి విపత్తుల నిధికి రూ.2000 కోట్లు కేటాయింపు
12:22 PM (IST) Mar 16
వ్యవసాయ సలహా మండలిల ఏర్పాటు చేసాం. పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్షణను ఈ సలహా మండల్లు చూడనున్నాయి.
12:20 PM (IST) Mar 16
ఆర్బికేల ద్వారా రైతులకు ఎరువుల సరఫరా చేయనున్నామని తెలిపారు.
12:18 PM (IST) Mar 16
రాయితీ విత్తనాలు పంపిణీ రూ.200 కేటాయింపు
12:17 PM (IST) Mar 16
రైతు భరోసా, కిసాన్ యోజన్ కింద రూ.7220 కోట్లు
ఉచిత పంటల భీమాకు రూ. 1600 కోట్లు కేటాయింపు
సున్నా వడ్డీ రాయితి రూ.500 కోట్ల కేటాయింపు
12:15 PM (IST) Mar 16
ఉచిత పంటల భీమాకు రూ.1600 కోట్లు కేటాయింపు
12:12 PM (IST) Mar 16
రైతు భరోసా కేంద్రాల 2023-24 ఆర్థిక సంవత్సరానికి 41 కోట్ల 55 లక్షల రూపాయల కోట్లు కేటాయింపు
12:10 PM (IST) Mar 16
రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రం కూడా ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.
12:07 PM (IST) Mar 16
కర్షక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు మారాయి. తన పల్లెలోనే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు.
12:06 PM (IST) Mar 16
వైసిపి ప్రభుత్వం ఇప్పటివరకు వ్యవసాయానకి లక్షా యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసారు.
12:05 PM (IST) Mar 16
గత పాలకుడు చంద్రబాబుతో కరువు జతకడితే జగనన్నతో వరుణుడి చెలిమి చేసాడని మంత్రి కాకాని అన్నారు.
12:03 PM (IST) Mar 16
వ్యవసాయ బడ్జెట్ ను కాకాని గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు.
12:00 PM (IST) Mar 16
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేసారు. అయితే రైతులపై భారం పడకుండా మీటర్ల ఖర్చుతో పాటు ఉచిత విద్యుత్ కల్పించేందుకు నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
11:59 AM (IST) Mar 16
2లక్షల 79 వేల 279 కోట్ల తో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఇందులో రెవెన్యూ వ్యయం - 2,28,540 కోట్లు, మూల ధన వ్యయం - 31,061 కోట్లుగా వుంది. రెవెన్యూ లోటు - 22,316 కోట్లు, ద్రవ్య లోటు - 54,587 కోట్లుగా పేర్కొన్నారు. జీఎస్డీపీ లో రెవిన్యూ లోటు - 3.77 శాతం ద్రవ్య లోటు - 1.54 శాతంగా వుందని తెలిపారు.
11:57 AM (IST) Mar 16
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రూ.532 కోట్లు కేటాయింపు
11:56 AM (IST) Mar 16
గ్రామ సచివాలయ మరియు వార్డు సచివాలయాల కోసం రూ.3858 కోట్లు కేటాయింపు
11:53 AM (IST) Mar 16
ఇంధన శాఖకు రూ.6,546 కోట్లు కేటాయింపు
11:52 AM (IST) Mar 16
పర్యావరణం, అటవీ, శాస్త్ర మరియు సాంకేతిక శాఖకు రూ.685 కోట్ల రూపాయలు కేటాయింపు
11:49 AM (IST) Mar 16
2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్ల కేటాయింపు
11:46 AM (IST) Mar 16
రవాణా, రహదారులు మరియు భవనాల శాఖకు రూ.9,118 కోట్లు కేటాయింపు
11:45 AM (IST) Mar 16
పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం రూ.2,606 కోట్లు కేటాయింపు