అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు:చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 22కి వాయిదా

By narsimha lode  |  First Published Nov 7, 2023, 12:59 PM IST


చంద్రబాబుపై వరుస కేసులు నమోదైన విషయం తెలిసిందే.  వరుస కేసుల నేపథ్యంలో కోర్టులను ఆశ్రయిస్తున్నారు చంద్రబాబు. 


అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ  ఈ నెల  22వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

అమరావతి  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  చంద్రబాబుకు గతంలో  ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబును ఇవాళ్టి వరకు  అరెస్ట్ చేయవద్దని  ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  ఇవాళ్టికి  మధ్యంతర ఉత్తర్వుల గడువు పూర్తి కానుంది.  ఏసీబీ కోర్టు విచారణ దశలో ఉన్న పీటీ వారంట్ పై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఐఆర్ఆర్ కేసులో  సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరిస్తారని  ఆయన తరపు న్యాయవాదులు గత విచారణలో  కోర్టుకు తెలిపారు.ఈ తరుణంలో ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Latest Videos

undefined

సుప్రీంకోర్టులో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తీర్పు ఉన్నందున ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు పాస్ ఓవర్ అడిగారు. దీంతో  ఈ పిటిషన్ పై విచారణను  ఈ నెల  22వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్న విషయాన్ని ఏజీ ఏపీ హైకోర్టు దృష్టికి తెచ్చారు.ఐఆర్ఆర్ కేసులో పీటీ వారంట్ పై ఒత్తిడి చేయబోమన్నారు. ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల  22వ తేదీ తర్వాత వాయిదా వేయాలని ఏజీ హైకోర్టును కోరారు. దరిమిలా ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల  22 వ తేదీకి వాయిదా వేసింది.

also read:పాత షరతులే వర్తిస్తాయి: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై సీఐడీ పిటిషన్ డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  టీడీపీ చీఫ్ చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో  చంద్రబాబుకు  గత నెలలో  మధ్యంతర బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.  ఈ నెల  28వ తేదీ వరకు చంద్రబాబుకు  మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.ఆరోగ్య కారణాలతో  చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో ఇతర కేసుల్లో కూడ ఒత్తిడి చేయబోమని  సీఐడీ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే.

click me!