ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ న్యూఢిల్లీలో రెండో రోజూ పర్యటన కొనసాగుతుంది. వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండో రోజూ పర్యటన కొనసాగుతుంది. శుక్రవారంనాడు న్యూఢిల్లీలో జరుగుతున్న వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం గురువారం నాడు అమరావతి నుండి న్యూఢిల్లీకి వచ్చారు. నిన్న సాయంత్రం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఇవాళ రాత్రికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కానున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా జగన్ ఢిల్లీకి వచ్చారు.
undefined
ఇవాళ న్యూఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తుంది.ఈ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
గత నెలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యూఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ పర్యటన వాయిదా పడింది. నిన్న జగన్ ఢిల్లీకి వచ్చారు. చంద్రబాబు అరెస్టైన తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల న్యూఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిన్ననే న్యూఢిల్లీ నుండి అమరావతికి చేరుకున్నారు. ఇవాళ చంద్రబాబుతో లోకేష్ భేటీ కానున్నారు.ఈ నెల 9వ తేదీన లోకేష్ మరోసారి ఢిల్లీకి వెళ్తారు.