ప్రముఖ క్రిరెటర్ అంబటి రాయుడు ఇవాళ ఏపీ సీఎం జగన్ కార్యాలయానికి చేరుకున్నారు.
అమరావతి: ప్రముఖ క్రిరెటర్ అంబటి రాయుడు గురువారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కొంత కాలంగా ఏపీ సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు. అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా జగన్ ను ప్రశంసిస్తున్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో అంబటి రాయుడు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సీఎం జగన్ విపక్షాలపై విమర్శలు చేశారు. ఈ విపక్షాలపై విమర్శలు చేస్తూ జగన్ చేసిన వీడియోను అంబటి రాయుడు రీ ట్వీట్ చేశారు.గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు క్రికెటర్ గా రాణించాడు. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోకి రాయుడు ప్రవేశించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. జగన్ ను అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు.వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏపీ సీఎం జగన్ తో అంబటి రాయుడు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
undefined
దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ విషయమై అంబటి రాయుడు మాత్రం ఈ విషయమై స్పష్టత ఇవ్వలేదు.కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు ఏపీ రాష్ట్రంలో ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఏపీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు సుమారు 12 శాతం ఉంటాయి.
ఆయా పార్టీల గెలుపు ఓటములను కాపు ఓటర్లు ప్రభావితం చేస్తారు.ఐపీఎల్ ముగిసిన తర్వాత అంబటి రాయుడు రాజకీయాల్లో ప్రవేశిస్తారని ప్రచారం సాగుతుంది. గుంటూరు జిల్లాలోని రేపల్లె, పొన్నూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.