అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు: హైకోర్టును ఆశ్ర‌యించిన మాజీ మంత్రి నారాయ‌ణ అల్లుడు

By Mahesh Rajamoni  |  First Published Oct 10, 2023, 2:00 PM IST

Amaravati: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ముందే తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి లోకేష్ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద సెప్టెంబర్ 30న టీడీపీ నేతకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండ‌గా,  ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయ‌ణ అల్లుడు హైకోర్టును ఆశ్ర‌యించారు. 
 


Amaravati Inner Ring Road case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ముందే తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి లోకేష్ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద సెప్టెంబర్ 30న టీడీపీ నేతకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇదిలావుండ‌గా,  ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయ‌ణ అల్లుడు హైకోర్టును ఆశ్ర‌యించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని పునీత్‌ను నోటీసుల్లో కోరారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హైకోర్టును ఆశ్ర‌యించారు. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలంటూ పునీత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.

Latest Videos

కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నోటీసులు అందుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ఉదయం తాడేపల్లిలోని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, మధ్యలో ఒక గంట భోజన విరామం ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కు సంబంధించి 15 ప్రశ్నలను సీఐడీ అధికారులు సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం నారా లోకేష్‌ను ఏపీ సీఐడీ విచారిస్తోంది.

click me!