నగరి లోకల్ అంటున్న రోజా

By rajesh yFirst Published Aug 27, 2018, 5:41 PM IST
Highlights

ఏపీ ఫైర్ బ్రాండ్ గా పేర్గాంచిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. తన పదునైన మాటలతో అధికార పార్టీని ఇరుకున పెట్టగల నేత. అన్ని అంశాలపైనా అనర్గళంగా మాట్లాడగల నేత. మాటల తూటాలతోనే కాదు సైగలతో కూడా విమర్శులు ఎక్కుపెట్టడం ఆమెకు ఆమె సాటి

చిత్తూరు: ఏపీ ఫైర్ బ్రాండ్ గా పేర్గాంచిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. తన పదునైన మాటలతో అధికార పార్టీని ఇరుకున పెట్టగల నేత. అన్ని అంశాలపైనా అనర్గళంగా మాట్లాడగల నేత. మాటల తూటాలతోనే కాదు సైగలతో కూడా విమర్శులు ఎక్కుపెట్టడం ఆమెకు ఆమె సాటి.

తనపైనా...తన పార్టీపైనా అధికార పార్టీ  కానీ ఇతర పార్టీలు విమర్శలు చేస్తే ఘాటుగా తిప్పికొట్టే రోజా తన సొంత నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యకు చెక్ పెట్టలేకపోతున్నారట. నగరి ఎమ్మెల్యేగా గెలిపొందిన రోజా స్థానికంగా నివాసం లేకపోవడంతో ఆమె లోకల్ కాదు నాన్ లోకల్ అంటూ విమర్శిస్తున్నారట. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు రోజా ఓ ఇళ్లు నిర్మించుకున్నారు. ఈనెల 30న నగరిలో సొంతింట్లో గృహ ప్రవేశం చేసి తాను నగరి లోకల్ అని నిరూపించుకోబోతున్నారు.

చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని ఓ గ్రామంలో జన్మించిన రోజా తిరుపతిలో విద్యాబ్యాసం చేశారు. రోజా అసలు పేరు శ్రీలత. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపుతెచ్చుకున్నరోజా 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. మెదట తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో క్రియాశీలక నేతగా ఉన్న ఆమె ప్రజారాజ్యం పార్టీపై నిప్పులు చెరిగేవారు.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లపైనా విమర్శలు గుప్పించి నిత్యం వార్తల్లో నిలిచేవారు. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన రోజా 2009లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గల్లా అరుణకుమారిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రోజా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రోజా పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ మరణించారు. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం పోటీచేసి టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడిపై గెలుపొందారు.

 2014లో అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజా తన మాటల తూటాలతో అధికార పక్షాన్ని తూర్పారపట్టేవారు..సైగలతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రుల సహనానికి పరీక్ష పెట్టేవారు. అయితే అసెంబ్లీలో ఆమె ప్రవర్తనపై పెద్ద చర్చే జరిగింది.

ఆమె ప్రవర్తనపై అసెంబ్లీ శాసన సభ వ్యవహారాల కమిటీ వేటు వేసింది. దీంతో అసెంబ్లీలో వైసీపీ వాణిని బలంగా వినిపించే ఓ వాయిస్ కోల్పోగా...తమను ఇరుకున పెట్టే నేత బహిష్కరణకు గురవ్వడంతో టీడీపీ ఊపిరిపీల్చుకుంది.

ఇవన్నీ ఇలా ఉంటే సొంత నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు రోజా లోకల్ కాదు అని పదేపదే విమర్శిస్తున్నారట. రోజా నాన్ లోకల్ అంటూ సమావేశాలు పెడుతూ విమర్శిస్తుండటంతో ఇంటగెలచి రచ్చగెలవాలనుకున్నారట.

అధికారపార్టీ విమర్శలను తిప్పికొట్టేందుకు నగరిలోని కొండచుట్టు మండపం వద్ద సొంతింటిని నిర్మించుకున్నారు. ఇంటి పనిపూర్తవ్వడంతో ఈనెల 30న గృహప్రవేశం చేయనున్నారు. దీంతో ఇప్పటివరకు రోజా లోకల్ కాదనే వారి నోళ్లకు చెక్ పడటమే కాదు...ఇక నగరిలో రోజా లోకల్ లోకల్ పక్కా లోకల్ అంటూ ఆమె అభిమానులు సంబరపడుతున్నారట.

click me!