హానికర పదార్ధాలు లేవు, కానీ: ఆనందయ్య మందుపై ఏకే సింఘాల్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 23, 2021, 07:10 PM IST
హానికర పదార్ధాలు లేవు, కానీ: ఆనందయ్య మందుపై ఏకే సింఘాల్ వ్యాఖ్యలు

సారాంశం

కృష్ణపట్నం ఆయుర్వేదం మందుపై నివేదిక అందాల్సి వుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సాంప్రదాయంగా వాడే మందులను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం లేదన్నారు. 

కృష్ణపట్నం ఆయుర్వేదం మందుపై నివేదిక అందాల్సి వుందన్నారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సాంప్రదాయంగా వాడే మందులను ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆనందయ్య మందులో నష్టం కలిగించేది ఏమీ లేవని చెబుతున్నారని అనిల్ కుమార్ తెలిపారు. సంప్రదాయ మందుకు, ఆయుర్వేద మందుకు తేడా వుంటుందని.. ఆయుర్వేద మందుగా గుర్తించాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు ఆనందయ్య మందును ఆయుర్వేదంగా గుర్తించే అవకాశం వుందన్నారు ఆయుష్ కమీషనర్ రాములు. మందుపై తుది అధ్యయనం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని రాములు తెలిపారు. మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో ఉపయోగించేవేనని.. ఇవాళ సాయంత్రానికల్లా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాములు వెల్లడించారు.

Also Read:నివేదికల కోసం వెయిట్ చేయొద్దు, పంపిణీ ఆపొద్దు: ఆనందయ్య మందుపై సీపీఐ నారాయణ

క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేదంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. ఆయుర్వేదంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో వుంటుందని.. కానీ కేంద్ర సాయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. మందు తయారీ విధానాన్ని బహిరంగ పర్చేందుకు ఆనందయ్య అంగీకరించారని.. ఆనందయ్య ఇచ్చే ఐ డ్రాప్స్‌లో కూడా ఎలాంటి హానికారకాలు లేవని రాములు తెలిపారు.

తేనే, ముళ్ల వంకాయ, తోక మిరియాల మిశ్రమంతో ఐ డ్రాప్స్ తయారు చేస్తున్నారని రాములు చెప్పారు. ఐ డ్రాప్స్ వల్ల ఇబ్బందులు వుండవని ఆయుర్వేద వైద్యుల బృందం నిర్థారించిందని తెలిపారు. ఆనందయ్య వాడుతున్న వివిధ పదార్ధాల మిశ్రమంతో ఎలాంటి ఎఫెక్ట్ వుండదని ల్యాబ్ టెస్టుల ద్వారా నిర్ధారణ అయ్యిందన్నారు. ఆనందయ్య ఎవరెవరికి మందులిచ్చారో డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నామని.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ స్టడీస్‌కు ఈ డేటా అందిస్తామని ఆయుష్ కమీషనర్ స్పష్టం చేశారు. ఆ బృందం దీనిపై అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్