వైసీపీ లోకి నటుడు శివాజీ రాజా..? రిటర్న్ గిఫ్ట్ ఇదేనా?

By ramya NFirst Published Mar 21, 2019, 10:04 AM IST
Highlights

ప్రముఖ సినీ నటుడు, మా( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజీ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

ప్రముఖ సినీ నటుడు, మా( మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజీ వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇవాళ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ లోటస్‌పాండ్‌‌లోనే ఉన్నారు. ఇప్పటికే మా మాజీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుస్తోంది.
 
కాగా.. పలువురు సీనియర్ నటులు ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకోగా శివాజీ రాజా కూడా ఆ జాబితాలో చేరనున్నారు.! శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వాట్సాప్, ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో రెండోసారి పోటీచేసిన శివాజీ రాజా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

అయితే.. ఓటమి తర్వాత శివాజీ రాజా.. నాగబాబుపై సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా ప్రకటించారు. అందులో భాగంగానే శివాజీ రాజా వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అందులో చేరి జనసేనకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం.

click me!