నేతాజీ సుభాష్ చంద్రబోస్, లోకేష్ ఒకే రోజు పుట్టడం సంతోషం: సినీనటి దివ్యవాణి

Published : Jan 23, 2019, 02:43 PM IST
నేతాజీ సుభాష్ చంద్రబోస్, లోకేష్ ఒకే రోజు పుట్టడం సంతోషం: సినీనటి దివ్యవాణి

సారాంశం

గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజున లోకేష్ పుట్టడం సంతోషమన్నారు.   

గుంటూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ పై సినీనటి దివ్యవాణి ప్రశంసలు కురిపించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన రోజున లోకేష్ పుట్టడం సంతోషమన్నారు. 

పుట్టినరోజున కూడా రాష్ట్రం కోసం దావోస్‌లో లోకేష్ పర్యటిస్తుండటం సీఎం చంద్రబాబు స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. చిన్న వయస్సులో నిత్యం కష్టపడుతున్న లోకేష్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని దివ్యవాణి ఆరోపించారు. 

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు అభినందనీయమని, అన్ని వర్గాలకు సంక్షేమ పధకాలు అద్భుతంగా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు లాంటి నేత ఏపీకి దొరకడం అదృష్టమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందని దివ్యవాణి విశ్వాసం వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్