చంద్రబాబు తన్నితే పాతాళానికి వెళ్తావ్ : రోజాకు దివ్యవాణి వార్నింగ్

Published : Feb 04, 2019, 03:41 PM IST
చంద్రబాబు తన్నితే పాతాళానికి వెళ్తావ్ :  రోజాకు  దివ్యవాణి వార్నింగ్

సారాంశం

చంద్రబాబు ఔట్ డేటెడ్ నాయకుడు కాదని రోజాయే  ఔట్ డేటెడ్ నాయకురాలని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రోజాకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి రోజా అనుకూలమా, లేక వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు. 

గుంటూరు: వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాపై సినీనటి, టీడీపీ నేత దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే రోజా పాతాళలోకానికి వెళ్తారంటూ నిప్పులు చెరిగారు. గుంటూరులో గుంటూరు జిల్లాలో పర్యటించిన ఆమె నాలుగేళ్లు ఎమ్మెల్యేగా చేసిన రోజానే ఎగిరెగిరి పడితే 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎలా మాట్లాడాలని మండిపడ్డారు. 

చంద్రబాబు ఔట్ డేటెడ్ నాయకుడు కాదని రోజాయే  ఔట్ డేటెడ్ నాయకురాలని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే రోజాకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పసుపు-కుంకుమ కార్యక్రమానికి రోజా అనుకూలమా, లేక వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు. 

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే వైసీపీకి  కడుపుమంట కలుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  డబ్బులు ఇచ్చి మరీ పరిటాల కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని వాటిని తాము తిప్పికొడతామన్నారు. 

పసుపు- కుంకుమ పథకంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు మహిళల గుండెల్లో గునపాల్లా గుచ్చుకుంటున్నాయని త్వరలో తగిన గుణపాఠం చెప్తారని విమర్శించారు. ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన రాయలసీమను చంద్రబాబు పారిశ్రామిక వాడలా మార్చారని గుర్తు చేశారు. 

మరోవైపు వైఎస్ జగన్‌పై జరిగిన కత్తి దాడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కోడి కత్తి డ్రామాలాగానే రేపు చేప ముల్లు డ్రామా కూడా ఆడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి. మెుత్తానికి రోజాపై దివ్యవాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్