పెడనలో దారుణం: మహిళపై యాసిడ్ దాడి, ఆసుపత్రికి తరలింపు

Published : May 02, 2023, 03:32 PM ISTUpdated : May 02, 2023, 04:27 PM IST
పెడనలో  దారుణం: మహిళపై  యాసిడ్ దాడి,  ఆసుపత్రికి తరలింపు

సారాంశం

ఉమ్మడి  కృష్ణా జిల్లాలోని  పెడనలో  మహిళపై ఇవాళ యాసిడ్ దాడి  జరిగింది.  బాధితురాలిని ఆసుపత్రిలో  చేర్పించారు.  

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో  మంగళవారంనాడు  మహిళ  యాసిడ్ దాడి  జరిగింది.  పెడన రామలక్ష్మి కాలనీలో  దుండగులు యాసిడ్  దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళ  కరుణ కుమారి తీవ్రంగా గాయపడింది.  ఆమెను  స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

కరుణకుమారిపై  యాసిడ్ దాడికి పాల్పడింది  రాముడుగా  పోలీసులు గుర్తించారు.  రాముడి వద్ద  కరుణ కుమారి  రూ. 20 వేలు అప్పుగా తీసుకుంది.  భర్తకు తెలియకుండా ఆమె ఈ అప్పు తీసుకుందని  సమాచారం. ఈ డబ్బులు ఆమె తిరిగి ఇవ్వలేదు. ఈ డబ్బుల విషయమై  రాముడు బాధితురాలిని వేధిస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేదనే  అక్కసుతో  కరుణకుమారిపై  రాముడు  యాసిడ్ దాడికి దిగాడు. 

 బాధితురాలు ఈ విషయమై  పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని  మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది.  కరుణకుమారిపై  యాసిడ్ దాడి  చేసిన రాముడిని  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  
 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami