ACB Raids : ఏపీ సచివాలయంలో ఏసిబి దాడి... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ లంచావతారం (వీడియో)

By Arun Kumar PFirst Published Nov 24, 2023, 2:57 PM IST
Highlights

ఉన్నత చదువుల కోసం విదేశాలను వెళ్లాలని ప్రయత్నిస్తున్న పేద యువకుడికి లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడో ఏపీ సచివాలయ ఉద్యోగి. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి పట్టుబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదవాలనుకునే పేద  విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఆర్థిక పరిస్థితి బాగాలేకే ప్రభుత్వ సాయం కోరుతున్న ఓ యువకుడికి ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ నాగభూషన్ రెడ్డి లంచం డిమాండ్ చేసాడు. అతడి ఎంత బ్రతిమాలినా లంచం ఇస్తేనే పని జరుగుతుందని తెగేసి చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితితో యువకుడు ఏసిబిని ఆశ్రయించాడు. 

యువకుడితో కలిసి లంచం అడిగిన అధికారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి ఏసిబి వల పన్నింది.  సచివాలయ బస్ షెల్టర్ వద్దకు యువకుడిని పిలుచుకుని రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు ఒక్కసారిగా దాడిచేసారు. ఇలా ఏపీ ఆర్థికశాఖ అధికారి నాగభూషన్ రెడ్డిని ఏసిబి అదుపులోకి తీసుకుంది

వీడియో

click me!