భర్తతో విబేధాలు: ఇద్దరు చిన్నారులతో కలిసి మహిళ ఆత్మహత్య

Published : Jun 29, 2019, 06:55 PM IST
భర్తతో విబేధాలు: ఇద్దరు చిన్నారులతో  కలిసి మహిళ ఆత్మహత్య

సారాంశం

నవీన తన తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉంటుంది. అయితే తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్థానని ఆమె ఇంటి వద్ద బయలు దేరింది. ఆకస్మాత్తుగా లొల్ల లాకుల వద్ద తన పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిచింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.   

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తతో ఉన్న విబేధాల కారణంగా ఇద్దరు చిన్నారులతో కలిసి లొల్ల లాకుల వద్ద కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది ఓ మహిళ. 

ఈ ఘటనలో చిన్నారి మృతదేహం లభ్యం కాగా మహిళ, ఆమె కుమారుడు మృతదేహం లభించాల్సి ఉంది. మృతదేహాల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే ఆత్రేయపురం మండలం వసంత వాడకు చెందిన శ్రీనుతో మండపేటకు చెందిన నవీనకు వివాహం జరిగింది. 

వీరికి కుమారుడు, కుమార్తె పిల్లలు. అయితే గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. నవీన తన తల్లిదండ్రులు ఇంటి వద్దే ఉంటుంది. అయితే తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్థానని ఆమె ఇంటి వద్ద బయలు దేరింది. ఆకస్మాత్తుగా లొల్ల లాకుల వద్ద తన పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిచింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్