24 గంటల్లో 9,747 మందికి కరోనా: కేసుల సంఖ్యలో దేశంలో మూడో స్థానంలోకి ఏపీ

Siva Kodati |  
Published : Aug 04, 2020, 08:01 PM IST
24 గంటల్లో 9,747 మందికి కరోనా: కేసుల సంఖ్యలో దేశంలో మూడో స్థానంలోకి ఏపీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 76 వేల 333కి చేరాయి

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య లక్షా 76 వేల 333కి చేరాయి. రాష్ట్రంలో వైరస్ కారణంగా 67 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,604కి చేరుకున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 79,104 యాక్టివ్ కేసులు ఉండగా.. 95,625 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 6,953 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 64,147 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

వీటితో ఇప్పటి వరకు 21 లక్షల 75 వేల 70 మందికి పరీక్షలు నిర్వహించినట్లయ్యింది. ఇవాళ్టీ కేసులతో కలిపి పాజిటివ్ కేసుల్లో దేశంలో మూడో స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ఇవాళ అనంతపురం జిల్లాలో అత్యథికంగా 1,325 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత తూర్పు గోదావరి 1,371, కర్నూలు 1,016, చిత్తూరు 26, గుంటూరు 940, కడప 765, కృష్ణ 420, నెల్లూరు 557, ప్రకాశం 224, శ్రీకాకుళం 537, విశాఖపట్నం 863, విజయనగరం 591, పశ్చిమ గోదావరిలలో 612 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు కోవిడ్ వల్ల గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కృష్ణ 9, కర్నూలు 8, చిత్తూరు 7, తూర్పుగోదావరి 7, నెల్లూరు 7, అనంతపురం 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 2, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami