కొత్తగా 831 మందికి పాజిటివ్ : ఏపీలో 8.45 లక్షలకు చేరిన కేసులు

Siva Kodati |  
Published : Nov 25, 2020, 09:59 PM IST
కొత్తగా 831 మందికి పాజిటివ్ : ఏపీలో 8.45 లక్షలకు చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 60,726 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 831 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 60,726 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 831 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,64,674కు చేరింది.

నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 6,962కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,176 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,45,039కు చేరుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 12,673 యాక్టివ్‌ కేసులున్నాయి. నిన్న జరిపిన టెస్టులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పరీక్షల సంఖ్య 97, 88 ,047కి చేరింది.

24 గంటల్లో అనంతపుపరం 34, చిత్తూరు 74, తూర్పుగోదావరి 126, గుంటూరు 90, కడప 37, కృష్ణా 145, కర్నూలు 28, నెల్లూరు 51, ప్రకాశం 12, శ్రీకాకుళం 23, విశాఖపట్నం 58, విజయనగరం 18, పశ్చిమ గోదావరిలలో 135 కేసులు నమోదయ్యాయి. కృష్ణ 2, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar