కొత్తగా 6,555 కేసులు : ఏపీలో 7,06,790కి చేరిన కరోనా సంఖ్య

Siva Kodati |  
Published : Oct 02, 2020, 07:00 PM ISTUpdated : Oct 02, 2020, 07:31 PM IST
కొత్తగా 6,555 కేసులు : ఏపీలో 7,06,790కి చేరిన కరోనా సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జోరు కొనసాగుతోంది. కొత్తగా 6,555 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,06,790కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా జోరు కొనసాగుతోంది. కొత్తగా 6,555 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7,06,790కి చేరింది.

నిన్న వైరస్ కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 5,900కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 56,897 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో 7,485 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,43,993కి చేరింది. నిన్న 70,399 శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఏపీలో టెస్టుల సంఖ్య 59,48,534కి చేరుకుంది.

అనంతపురం 333, చిత్తూరు 925, తూర్పు గోదావరి 975, గుంటూరు 451, కడప 339, కృష్ణ 473, కర్నూలు 204, నెల్లూరు 486, ప్రకాశం 668, శ్రీకాకుళం 223, విశాఖపట్నం 297, విజయనగరం 251, పశ్చిమ గోదావరిలలో 930 కేసులు నమోదయ్యాయి.

కృష్ణ 6, అనంతపురం 4, తూర్పుగోదావరి 4, చిత్తూరు 3, కర్నూలు 3, విశాఖపట్నం 3, గుంటూరు 2, ప్రకాశం 2, పశ్చిమ గోదావరి 2, కడప, శ్రీకాకుళంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu