అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Siva Kodati |  
Published : Jul 22, 2023, 07:23 PM IST
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

సారాంశం

అన్నమయ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.

అన్నమయ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం కడప నుంచి తిరుపతికి వెళ్లున్న ఆర్టీసీ బస్సు ఓరంపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం కారణంగా రాజంపేట - తిరుపతి మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే
Nandu's World Controversy: నమ్మి డబ్బులిస్తే ఇదే పరిస్థితి.. యూట్యూబర్స్ 'నందూస్ వరల్డ్' దందా