ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు దుర్మరణం

Siva Kodati |  
Published : Jun 11, 2022, 07:42 PM ISTUpdated : Jun 11, 2022, 08:44 PM IST
ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు దుర్మరణం

సారాంశం

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని అక్కచెరువుపాలెంలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా (prakasam district) జరుగుమల్లి మండలంలోని అక్కచెరువుపాలెంలో ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారులు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. వీరిని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు మృతదేహాలను వెలికి తీయగా .. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఒకేరోజు ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu