ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 48 కేసులు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసులు కోయంబేడుతో లింకులున్నవి. ఏపీలో కరోనాతో కొత్తగా ఒకరు మరణించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరొకరు మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో ఒకరు కరోనాతో మరణించారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,148 శాంపిల్స్ ను పరీక్షించగా 48 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 55 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2619 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1903 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా 759 మందజి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
undefined
: as on 26/05/2020 10:00AM
*Total registered cases in the state: 2719
*Discharged: 1903
*Deceased: 57
*Active Cases: 759 pic.twitter.com/agbgDQTpLG
గత 24 గంటల్ల నమోదైన కేసుల్లో నాలుగు కేసులు కోయంబేడు మార్కెట్ తో లింకులున్నవి. ఈ నాలుగు కేసులు కూడా చిత్తూరు జిల్లాలోనే నమోదయ్యాయి.
విదేశాల నుంచి వచ్చినవారిలో 111 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ రోజు కొత్త 49 కేసులు నమోదయ్యాయి. వీటిలో కువైట్ కు చెందిన కేసులు 49 కాగా, అబూ దుబాయ్ నుంచి వచ్చినవారిలో ముగ్గురికి, ఖతర్ నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
Cumulative positive cases from other states:153. (Odisha: 10, Maharastra: 101, Gujarat: 26, Karnataka: 1, West Bengal: 1, Rajasthan:11, Tamilnadu:3 ) Active cases: 117 ( 2 Discharges from Maharastra)
— ArogyaAndhra (@ArogyaAndhra)ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 153 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇందులో ఒదడిశాకు చెందినవారు 10 మంది, మహారాష్ట్రకు చెందినవారు 101 మంది, గుజరాత్ నుంచి వచ్చినవారు 26 మంది ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చినవారిలో ఒకరికి, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినవారిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. రాజస్థాన్ నుంచి వచ్చినవారిలో 11 మందికి, తమిళనాడు నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటి ఉన్నట్లు తేలింది.