ఏపీలో ఆగని కరోనా విజృంభణ: 2561 పాజిటివ్ కేసులు, 56 మంది మృతి

By telugu team  |  First Published May 23, 2020, 12:57 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 47 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో మరణం సంభవించింది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కట్టడి కావడం లేదు. అయితే, శుక్రవారం కన్నా శనివారంనాడు కాస్తా తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 47 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2561కి చేరుకుంది. 

 

:
రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)
*9,136 సాంపిల్స్ ని పరీక్షించగా 47 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*47 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
*కోవిడ్ వల్ల కృష్ణ లో ఒక్కరు మరణించారు.

— ArogyaAndhra (@ArogyaAndhra)

Latest Videos

undefined

తాజాగా గత 24 గంటల్లో 47 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 1778 మంది డిశ్చార్జీ అయ్యారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరో మరణం సంభించింది. దీంతో మొత్తం కరోనా వైరస్ మృతుల సంఖ్య 56కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727గా ఉంది. 

తాజాగా గత 24 గంటల్లో నమోదైన 47 కేసుల్లో ఐదు కోయంబేడుతో సంబంధం ఉన్నవి. వాటిలో మూడు చిత్తూరు జిల్లాలో, రెండు నెల్లూరు జిల్లాలో నమోదయ్యాయి. 

 

:
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసు లకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727.

— ArogyaAndhra (@ArogyaAndhra)

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఒకరి నుంచి పలువురికి కరోనా వైరస్ అంటుకుంటోంది. గురువారంనాడు కరోనా వైరస్ బారిన పడి 53 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఆనకు గొల్లల మామిడాడలో ఫొటో స్టూడియో ఉంది. పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు ఫొటోలు తీసే కాంట్రాక్టులు చేస్తుంటాడు. 

ఇది వరకే చేసుకున్న ఒప్పందం మేరకు అనతు రామచంద్రపురంలో ఓ శుభకార్యం ఫొటోలు తీయడానికి వెళ్లాడు. అక్కడ అతను కరోనా వైరస్ బారిన పడినట్లు అధికారులు భావిస్తు్నారు ఆ తర్వాత అనపర్తికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడి నుంచి మేనకోడలు ఇంటికి వెళ్లాడు. తనకు కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని అతను గుర్తించలేదు. దాంతో అతను మరణించాడు. శుక్రవారంనాడు 8 మందికి అతని ద్వారా కరోనా వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. 

click me!