ఏపీలో భారీగా పడిపోయిన కేసులు: కొత్తగా 4,169 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధిక మరణాలు

Siva Kodati |  
Published : Jun 22, 2021, 04:53 PM IST
ఏపీలో భారీగా పడిపోయిన కేసులు: కొత్తగా 4,169 మందికి పాజిటివ్, చిత్తూరులో అత్యధిక మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,169 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,54,457కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,169 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,54,457కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 53 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,416కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి  ప్రకాశం 6, అనంతపురం 4, తూర్పుగోదావరి 6, చిత్తూరు 7, గుంటూరు 2, కర్నూలు 2, విజయనగరం 2, నెల్లూరు 4, కృష్ణ 5, విశాఖపట్నం 3, శ్రీకాకుళం 5, పశ్చిమ గోదావరి 3, కడపలో నలుగురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 8,376 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 17,88,161కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 74,453 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,12,80,302కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 53,880 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 264, చిత్తూరు 472, తూర్పుగోదావరి 743, గుంటూరు 273, కడప 160, కృష్ణ 368, కర్నూలు 126, నెల్లూరు 236, ప్రకాశం 357, శ్రీకాకుళం 180, విశాఖపట్నం 251, విజయనగరం 80, పశ్చిమ గోదావరిలలో 659 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్