బిస్కెట్‌ ఆశచూపి.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

Siva Kodati |  
Published : Aug 09, 2019, 09:17 AM IST
బిస్కెట్‌  ఆశచూపి.. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

సారాంశం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో బుధువారం మధ్యాహ్నం బాధిత చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ సమయంలో గ్రామానికే చెందిన ఓ వ్యక్తి బిస్కెట్ ఇస్తానని చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు

బిస్కెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లి నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. వివరాల్లోకి వెళితే... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో బుధువారం మధ్యాహ్నం బాధిత చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటోంది.

ఈ సమయంలో గ్రామానికే చెందిన ఓ వ్యక్తి బిస్కెట్ ఇస్తానని చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న కూతురు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇంటి సమీపంలో వెతికారు.

ఈ సమయంలో ఏడ్చుకుంటూ ఇంటికి చేరుకున్న పాప.. వారికి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారిని వైద్య పరీక్షల కోసం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి.. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం