వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

Published : Oct 09, 2023, 10:18 AM IST
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

సారాంశం

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.

వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

ఈ ప్రమాదంలో మృతిచెందినవారిని మహమ్మద్, హసీనా, అమీనా, షాకీర్‌లు గుర్తించారు. వీరంతా కడప జిల్లా ఆజాద్ నగర్ కాలనీకి చెందినవారు. అయితే వీరు ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటన‌కు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Kadapa Steel Plant: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మ‌రో ముంద‌డుగు.. 3,500 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడి
Nara Lokesh Emotional: చిన్నప్పుడే నాన్న చనిపోయారు..ఈ విద్యార్థిని కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు