ఏపీకి బిగ్ రిలీఫ్: భారీగా పడిపోయిన కరోనా కేసులు, మరణాలు

Siva Kodati |  
Published : Oct 14, 2020, 07:30 PM ISTUpdated : Oct 14, 2020, 07:33 PM IST
ఏపీకి బిగ్ రిలీఫ్: భారీగా పడిపోయిన కరోనా కేసులు, మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు బుధవారం భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 3,892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు బుధవారం భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 3,892 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,67,465కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే 28 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో 6,319కు చేరుకుంది.

గత 24 గంటల్లో 5,050 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 7,19,477కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 41,669 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 69,463 శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 67,72,273కి చేరుకుంది.

గత 24 గంటల్లో అనంతపురం 290, చిత్తూరు 405, తూర్పుగోదావరి 607, గుంటూరు 345, కడప 332, కృష్ణ 458, కర్నూలు 104, నెల్లూరు 219, ప్రకాశం 146, శ్రీకాకుళం 154, విశాఖపట్నం 163, విజయనగరం 151, పశ్చిమ గోదావరిలలో 518 కేసులు నమోదయ్యాయి.

అలాగే చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, శ్రీకాకులంలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?