ఏపీలో కొత్తగా 3,042 మందికి పాజిటివ్: కేసుల్లో తూర్పుగోదావరి, మరణాల్లో చిత్తూరు టాప్

Siva Kodati |  
Published : Jul 06, 2021, 06:59 PM IST
ఏపీలో కొత్తగా 3,042 మందికి పాజిటివ్: కేసుల్లో తూర్పుగోదావరి, మరణాల్లో చిత్తూరు టాప్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అదుపులోనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,042 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,05,170కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అదుపులోనే వున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,042 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,05,170కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,898కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2, ప్రకాశం 1,  తూర్పుగోదావరి 4, నెల్లూరు 4, చిత్తూరు 7, గుంటూరు 2, కృష్ణ 1, విశాఖపట్నం 1, పశ్చిమగోదావరి 2, శ్రీకాకుళం 1, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,748 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,59,042కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 88,378 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,25,24,187కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 33,230 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 91, చిత్తూరు 358, తూర్పుగోదావరి 665, గుంటూరు 277, కడప 79, కృష్ణ 252, కర్నూలు 51, నెల్లూరు 251, ప్రకాశం 310, శ్రీకాకుళం 116, విశాఖపట్నం 171, విజయనగరం 61, పశ్చిమ గోదావరిలలో 360 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు