అనంతలో ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ తీగలు: 30 మంది ప్రయాణీకులు సురక్షితం

By narsimha lodeFirst Published Nov 24, 2022, 10:31 AM IST
Highlights

ఉమ్మడి  అనంతపురం జిల్లాలోని  రొద్దం  మండల కేంద్రంలో ఆర్టీసీ  బస్సుపై  విద్యుత్  తీగలు పడ్డాయి.  బస్సు డ్రైవర్  అప్రమత్తంగా  వ్యవహరించడంతో  ప్రమాదం  తప్పింది. 

అనంతపురం: ఉమ్మడి  అనంతపురం జిల్లాలోని  రొద్దం  మండల  కేంద్రంలో  ఆర్టీసీ బస్సుపై  విద్యుత్  తీగలు  పడ్డాయి.  బస్సు డ్రైవర్  అప్రమత్తంగా  వ్యవహరించడంతో  పెద్ద  ప్రమాదం  తప్పింది. ఉమ్మడి  అనంతపురం  జిల్లాలోని విద్యుత్  వైర్లు  వాహనాలపై  పలు ప్రమాదాలు  జరిగాయి.సత్యసాయి  జిల్లాలోని  తాడిపర్రి మండలం చిల్లకొండయ్యపల్లెలో ఆటోపై  హైటెన్షన్  విద్యుత్  వైర్లు ఆటోపై  పడి  ఐదుగురు కూలీలు  సజీవదహనమయ్యారు.  వ్యవసాయ పనులకు  వెళ్తున్న  సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.  విద్యుత్  ట్రాన్స్ ఫార్మర్ నుండి  విద్యుత్ సరఫరాకు  ఏర్పాటు  చేసిన  కేబుల్  తెగి  ఆటోపై  పడింది.  ఉడుత  కారణంగానే  ఈ  విద్యుత్  వైర్లు  తెగినట్టుగా  విద్యుత్ శాఖాధికారులు  నిర్ధారించారు.  ఈ  ప్రమాదం  ఈ ఏడాది  జూన్  30న  ఈ ఘటన  చోటు  చేసుకుంది. 

అనంతపురం  జిల్లా బొమ్మనహల్  మండలం  దర్గాహన్నూరులో  విద్యుత్  మెయిన్ లైన్లు  తెగిపడి నలుగురు కూలీలు  మరణించారు.  విద్యుత్  వైర్లు  తెగి  ట్రాక్టర్ పై  పడ్డాయి.  వ్యవసాయ  కూలీలు  పని  కోసం  ట్రాక్టర్ పై  వెళ్తున్న  సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.ఈ  ఘటన  ఈ నెల  2న  చోటు  చేసుకుంది. నాలుగు మాసాల్లో  అనంతపురం  జిల్లాలో  జరిగిన  ప్రమాదాల్లో  11  మంది  మృతి  చెందారు. 

also read:అనంతపురంలో విషాదం:విద్యుత్ షాక్ తో నలుగురు కూలీలు మృతి

ఉమ్మడి  అనంతపురం  జిల్లాలో  తరుచుగా  విద్యుత్  వైర్లు  తెగిపడి  ప్రమాదాలు  జరుగుతున్నాయి. ఈ తరహ  ప్రమాదాలపై  సీఎం  జగన్  అధికారులకు  కీలక  ఆదేశాలు  జారీ  చేశారు,.  రాష్ట్రంలోని  ఏయే ప్రాంతాల్లో  ఈ  తరహ  విద్యుత్  వైర్లున్నాయో  గుర్తించి  విద్యుత్  వైర్లను  మార్చాలని ఆదేశించారు. 


 

click me!