వైఎస్ జగన్ కు లేఖ రాసిన పార్టీమారిన ఎమ్మెల్యేలు

By rajesh yFirst Published Sep 5, 2018, 9:12 PM IST
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత  జగన్ కు లేఖ రాశారు. వైఎస్ జగన్ వ్యవహార శైలి నచ్చక పార్టీ నుంచి బయటకి వచ్చామని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. ఎదుటి మనిషిని గౌరవించే సంస్కృతి జగన్‌కు లేదని, ఆయనపై అసంతృప్తితోనే వైసీపీకి ని విడిచి టీడీపీలో చేరామని తెలిపారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీ అధినేత  జగన్ కు లేఖ రాశారు. వైఎస్ జగన్ వ్యవహార శైలి నచ్చక పార్టీ నుంచి బయటకి వచ్చామని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. ఎదుటి మనిషిని గౌరవించే సంస్కృతి జగన్‌కు లేదని, ఆయనపై అసంతృప్తితోనే వైసీపీకి ని విడిచి టీడీపీలో చేరామని తెలిపారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. వారిలో నలుగురికి మంత్రి పదవులు సైతం ఇచ్చింది టీడీపీ. రాయలసీమకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కేబినేట్ లో స్థానం కల్పించగా ఉత్తరాంధ్ర నుంచి ఒక ఎమ్మెల్యేకు స్థానం కల్పించారు. 

అయితే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలతో టీడీపీ కొనుగోలు చేస్తుందని...వారికి మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని ఆరోపిస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది వైసీపీ.

గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు వైసీపీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చెయ్యగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీకి వస్తామని స్పష్టం చేస్తూ స్పీకర్ కోడెల శివప్రసాద్, సీఎం చంద్రబాబు నాయుడులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు జగన్ కు లేఖాస్త్రం సంధించారు. గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని లేఖలో ఆరోపించారు. 

click me!