స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని 20మంది విద్యార్థుల అస్వస్థత

By Arun Kumar PFirst Published Dec 29, 2018, 4:08 PM IST
Highlights

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 20 మంది చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ విషాద సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థలంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ప్రాణాలకేమీ ముప్పు లేదని డాక్టర్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

కర్నూలు జిల్లా నందెన పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం పాఠశాలలో అదించే బోజనాన్ని తిన్న కొంతమంది విద్యార్థులకు సాయంత్రం సమయంలో తీవ్ర వాంతులు, విరేచనాలకు లోనయ్యారు. అలాగే తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండటంతో వారందరికి కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు...ఎవరికి ఎలాంటి అపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే చిన్నారులు అనారోగ్యానికి గురయినట్లు తెలుస్తోంది. 

విద్యార్థుల కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. పాఠశాలలో మద్యాహ్న భోజనాన్ని వండిన వారితో పాటు ఉపాధ్యాయులను కూడా విచారిస్తున్నారు. 
 
click me!