తూ.గోలో అత్యధికం: ఏపీలో 8,86,852కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Jan 23, 2021, 06:13 PM IST
తూ.గోలో అత్యధికం: ఏపీలో 8,86,852కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,86,852కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 158 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 8,86,852కి చేరింది.

నిన్న ఒక్క రోజు కోవిడ్ కారణంగా విశాఖలో ఒకరు మరణించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,147కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని పలు ఆసుపత్రుల్లో 1,473 మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో 172 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,78,232కి చేరుకుంది. నిన్న 43,770 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు పరీక్షల సంఖ్య 1,28,31,731కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 11, చిత్తూరు 10, తూర్పుగోదావరి 35, గుంటూరు 12, కడప 7, కృష్ణ 23, కర్నూలు 5, నెల్లూరు 1, ప్రకాశం 2, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 18, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 28 కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu