తిరుమల మెట్లెక్కిన 116ఏళ్ల బామ్మకి VIP బ్రేక్ దర్శనం | Asianet News Telugu

తిరుమల మెట్లెక్కిన 116ఏళ్ల బామ్మకి VIP బ్రేక్ దర్శనం | Asianet News Telugu

Published : Jul 06, 2026, 12:36 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మెట్ల మార్గంలో ప్రయాణించి వైరల్ అయిన 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మకి టీటీడీ ప్రత్యేక VIP బ్రేక్ దర్శనం కల్పించింది. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ, తమ అమ్మమ్మ జీవితకాల కోరికను నెరవేర్చిన టీటీడీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నవనీతమ్మని గుర్తించడంలో సహకరించిన సోషల్ మీడియా మిత్రులకు, వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.