కృష్ణా జిల్లాలో విషాదం.. మురికి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి

Siva Kodati |  
Published : Jun 26, 2022, 09:18 PM ISTUpdated : Jun 26, 2022, 09:24 PM IST
కృష్ణా జిల్లాలో విషాదం.. మురికి గుంతలో పడి 11 నెలల చిన్నారి మృతి

సారాంశం

కృష్ణా జిల్లా కూచిపూడిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు మురికి గుంతలో పడి ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి తండ్రి రాజేశ్ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాబు మరణంతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.   

కృష్ణా జిల్లా కూచిపూడిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి ముందు మురికి గుంతలో పడి ఏడాది చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఇందిరా నగర్‌కు చెందిన కొక్కిలిగడ్డ రాజేశ్ సురేఖ దంపతుల కుమారుడు మహి (11 నెలలు) ఆదివారం ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మురికి గుంతలో పడ్డాడు. పెద్దలు గమనించేలోపే చిన్నారి మునిగి ఊపిరాడక ప్రాణాలు వదిలాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి తండ్రి రాజేశ్ తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాబు మరణంతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం