టీడీపీలోకి భారీ వలసలు.. ఎమ్మెల్యే సమక్షంలో 100కుటుంబాల చేరిక

Published : Aug 24, 2018, 03:11 PM ISTUpdated : Sep 09, 2018, 01:04 PM IST
టీడీపీలోకి భారీ వలసలు.. ఎమ్మెల్యే సమక్షంలో 100కుటుంబాల చేరిక

సారాంశం

వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసే బోయ సామాజిక వర్గానికి చెందిన వీరంతా టీడీపీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిస్తోంది.

అనంతపురం జిల్లాలో టీడీపీలోకి భారీ వలసలు చోటుచేసుకున్నాయి. ధర్మవరంలో ఒకేసామాజిక వర్గానికి చెందిన వందకుటుంబాలు గురువారం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సమక్షంలో వైసీపీకి గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. పట్టణంలోని శ్రీనివాస కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాంనగర్‌ గూడ్‌షెడ్‌ కొట్టాలకు చెందిన ఏటూరి చెన్నప్ప, ఏటూరి పోతలయ్య, లింగమయ్య ఆధ్వర్యంలో వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి.

 వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసే బోయ సామాజిక వర్గానికి చెందిన వీరంతా టీడీపీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోనుగుంట్ల మాట్లాడుతూ వైసీపీ నుంచి వంద కుటుంబాలు టీడీపీలోకి చేరడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. టీడీపీలో కష్టపడేవారికి ఎప్పుడూ ప్రాధాన్యముంటుందన్నారు. వీరు కూడా సైనికుల్లా పనిచేసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయపథానికి చేర్చాలని ఆయన కోరారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్