అల్లూరి జిల్లాలో టూరిస్టు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు..

Published : Oct 09, 2022, 04:43 PM IST
అల్లూరి జిల్లాలో టూరిస్టు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు..

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో టూరిస్ట్ బస్సు కొండపై నుంచి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో టూరిస్ట్ బస్సు కొండపై నుంచి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పర్యాటక ప్రాంతమైన వంజంగి ఘాటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు విశాఖపట్నం నుంచి పాడేరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానికులు.. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు, అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. గాయపడినవారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. 

వంజంగి హిల్స్ వద్ద ఎత్తైన కొండలు ఎక్కే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నామ‌ని టూరిస్టులు అంటున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu