ఓట్స్‌లో పీచు పదార్థం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఉదయం టిఫిన్‌గా ఓట్స్ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు.
ఓట్స్ (oats) తింటే చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. ఓట్స్ లో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్, కొలెస్ట్రాల్, బైల్ యాసిడ్స్‌తో బంధించి, వాటిని శరీరం నుండి బయటకు పంపుతుంది.
ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఓట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ మంచి ఆహారం. ఇందులో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఓట్స్ లో ఫైబర్ (fiber) కూడా అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదించడంతో మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు
ఓట్స్ లో ప్రోటీన్ మోతాదు తక్కువగా ఉన్నప్పటికీ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఓట్స్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ఓట్స్‌లో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.