Diabetes: షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే.. ఈ చిట్కాలు మీకు తెలుసా?
Telugu
నడక
భోజనం తర్వాత 15 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. తిన్న త ర్వాత నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
Telugu
విటమిన్ డి, కె 2, మెగ్నీషియం
విటమిన్ డి, కె 2, మెగ్నీషియం ఉన్న సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. విటమిన్ డి షుగర్ ను నియంత్రించే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
Telugu
సరైన నిద్ర
సరైన నిద్ర హార్మోన్లను నియంత్రిస్తుంది, గ్లూకోజ్ జీవక్రియకు మద్దతు ఇస్తుంది, మానసిక ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
Telugu
పీచు పదార్థాలు
పీచు పదార్థాలు (ఫైబర్) ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వలన ప్రేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Telugu
నో జ్యూస్
పండ్లను జ్యూస్‌గా తీసుకోకండి. జ్యూస్‌గా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే పండ్ల రసంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల షుగర్ పెరిగే అవకాశముంది.
Telugu
కూరగాయలు తీసుకోండి
షుగర్ పేషెంట్లకు పోషకాలు అందించే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యం. మీ భోజనంలో 50% కంటే ఎక్కువ కూరగాయలు. అంటే ఉడికించిన లేదా పచ్చివి ఉండేలా చూసుకోండి.