Asianet News TeluguAsianet News Telugu

పవార్ మేనల్లుడి దెబ్బకు హరీష్ రావు రికార్డు గల్లంతు

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ దెెబ్బకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు రికార్డు గల్లంతైంది. కేసీఆర్ మేనల్లుడైన హరీష్ రావు రికార్డును మరో పార్టీ అధినేత మేనల్లుడు బద్దలు కొట్టడం విశేషం.

ajith pawar breaks the record of harish rao for highest majority
Author
Mumbai, First Published Oct 25, 2019, 1:15 PM IST

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నిన్న వెలువడ్డాయి. మహారాష్ట్రలో బీజేపీ శివసేనల కూటమి మరోమారు తిరిగి అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. మరోమారు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ అధికార పీఠం ఎక్కనున్న. 

ఎన్నికలన్నాక రికార్డులు బద్దలవడం,నూతన రికార్డులు నెలకొల్పడం మనం చూస్తూనే ఉంటాం. సహజంగా ఇలాంటి రికార్డులు గెలిచిన పార్టీ నెలకొల్పడం పరిపాటి. ఎక్కడో ఒకసారి అధికారం చేజిక్కించుకోని పార్టీల అభ్యర్థులు నెలకొల్పుతూ ఉంటారు. నిన్న మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ కి చెందిన అజిత్ పవార్ ఇలాంటి భారీ రికార్డునే నెలకొల్పి హరీష్ రావు రికార్డును బద్దలు కొట్టాడు. 1.65లక్షల రికార్డు మెజారిటీ సాధించాడు. 

సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు ఈ అజిత్ పవార్. 1991 నుంచి బారామతి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్నాడు. సహజంగానే పవార్ కుటుంబ కంచుకోటైన బర్మతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది ఈ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం. 

నిన్నటి ఎన్నికల్లో ఎన్సీపీ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అజిత్ పవార్ సమీప బీజేపీ అభ్యర్థి గోపిచంద్ పై 1.65లక్షల రికార్డు మెజారిటీ సాధించాడు. ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ రికార్డు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు పేరిట ఉండేది. దాన్ని చెరిపేసాడు. గత ఎన్నికల్లో హరీష్ రావు 120650 మెజారిటీ తో గెలిచాడు. ఇప్పుడు అజిత్ పవార్ 165265 మెజారిటీ తో గెలిచి ఆ రికార్డును తిరిగిరాసాడు. 

ఇదొక్కటే కాదు ఇతను హరీష్ ఇంకో రికార్డును సమం చేసాడు . అజిత్ పవార్ కూడా హరీష్ రావు మాదిరే డబల్ హాట్ ట్రిక్ సాధించడం విశేషం.  వీరిరివురి మధ్య ఇంకో కీలక పోలికేంటంటే వీరిద్దరూ కూడా పార్టీ అధినేతల మేనల్లుళ్లు అవ్వడం విశేషం. మరో కాంగ్రెస్ నేత విశ్వజిత్ కదం కూడా లక్ష 62వేల మెజారిటీతో మరో రికార్డు నెలకొల్పాడు. రితేష్ దేశ్ ముఖ్ సోదరుడు, హీరోయిన్ జెనీలియా బావ, మహా మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ తనయుడు ధీరజ్ దేశ్ ముఖ్ తొలి ఎన్నికల్లోనే లక్ష 21వేల మెజారిటీ తో ఇతను సైతం హరీష్ రికార్డును బద్దలు కొట్టాడు. 

also read: మేం సాధించాం నాన్న.. రితేష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ పోస్ట్!

గత సెప్టెంబర్ లో శరద్ పవార్ కు ఈడీ నోటీసులివ్వడంతో నిరసనగా తన పోస్టుకు రాజీనామా చేసాడు. 79 ఏండ్ల  వయసులో ఎన్నికల ముందు శరద్ పవార్ పై ఇలాంటి కక్ష సాధింపు చర్యలేంటని మండిపడుతూ రాజీనామా చేసాడు. బారామతి నియోజకవర్గాన్ని చాల బాగా అభివృద్ధి చేసాడు. ఒక హై ప్రొఫైల్ లీడర్ నియోజకవర్గం ఎలా ఉంటుందని అందరూ ఊహిస్తారో అలానే ఉంటుంది. మన హరీష్ రావు కూడా సిద్ధిపేట నియోజకవర్గాన్ని ఇలానే అభివృద్ధి చేసారు. 

ఈ లెవెల్ లో అభివృద్ధి చేసారు కాబట్టే ఇటు హరీష్ నైనా అటు అజిత్ పవార్ ను అయినా ప్రజలు అత్యధిక మెజార్టీలతో గెలిపిస్తున్నారు.  

మహారాష్ట్ర ఎన్నికలు ఈ పర్యాయం అత్యధిక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శివ సేన పార్టీ వ్యవస్థాపక కుటుంబం నుంచి తొలిసారి ఒక వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుత శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తనయుడు, బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే ఈ సరి బరిలో నిలిచారు. 

రైతుల,రైతాంగ సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నా, మోడీ ఇమేజ్ వల్ల, సరైన ప్రతిపక్షం లేని కారణంగా ఇక్కడ బీజేపీ శివ సేనల కూటమి గెలుపు నల్లేరు మీద నడకని పండితులంతా ఊహిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన పార్టీ ఫిరాయింపులు ఇటు కాంగ్రెస్ ను అటు ఎన్సీపీని తీవ్రంగా నష్టపరిచాయి. 

also read: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం దెబ్బ: కాంగ్రెస్ ఢమాల్, బీజేపీ కూటమి జోరు

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడింది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలోకి దిగారు. 288 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios