Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో... తెలుగు మాట్లాడే వారు ఇంత మందా!

అమెరికాలో  తెలుగు వెలుగులు. 79 శాతం పెరిగిన తెలుగు మాట్లాడేవారి సంఖ్య. అమెరికాలో గణనీయంగా పెరుగుతున్న తెలుగు మాట్లాడే వారి సంఖ్య. ఇవి తాజాగా విడుదలైన సర్వేలో వెల్లడైన వివరాలు.

there was hike in telugu talking people in us:survey report
Author
Hyderabad, First Published Nov 1, 2019, 3:28 PM IST

అగ్రరాజ్యం అయిన అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య  ప్రతి ఏటా పెరుగుతూ ఉంది. కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది కూడా గణనీయంగా పెరిగింది. అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

గత ఎనిమిదేళ్లలో చూసుకుంటే  తెలుగు మాట్లాడేవారి శాతం పెరిగినట్లు యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో ఇటీవల విడుదల చేసిన అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే రిపోర్టు  2018 పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం గత 8 ఏళ్లలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఏకంగా 79.5 శాతం పెరిగిందిఅని పేర్కొంది.

also read యూకేలో ఘనంగా బతుకమ్మ జాతర సంబరాలు

2010లో 2.23లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉంటే 2018లో ఈ సంఖ్య 4 లక్షలకు చేరింది. దీంతో అమెరికాలో అత్యధిక మంది మాట్లాడుతున్న భారతీయ భాషల్లో తెలుగు మూడోస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, 2017తో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది.

there was hike in telugu talking people in us:survey report

2017లో తెలుగు మాట్లాడేవారు 4.17 లక్షలు ఉండగా, గతేడాదిలో అది 3.7 శాతం తగ్గి 4లక్షలకు చేరింది.ఇక 8.74 లక్షలతో హిందీ అగ్రస్థానంలో ఉంటే, గుజరాతీ రెండోస్థానంలో ఉంది. 2018, జూలై 1 నాటికి యూఎస్‌లో మొత్తం 8.74 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నట్లు ఈ సర్వే రిపోర్టు తేల్చింది.

also read అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

2010తో పోలిస్తే 2018 నాటికి హిందీ మాట్లాడే వారి సంఖ్య 43.5 శాతం పెరిగింది. అమెరికాలో 67.3 మిలియన్ల మంది తమ ఇళ్లలో ఆంగ్లం కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారని కూడా ఈ  సర్వే పేర్కొంది. ఈ ఎనిమిదేళ్లలో బెంగాలీ మాట్లాడే వారి సంఖ్య 68 శాతం, తమిళం మాట్లాడే వారి సంఖ్య 67.5 శాతం పెరిగినట్లు తాజాగా విడుదలైన సర్వేలో వెల్లడైంది.

Follow Us:
Download App:
  • android
  • ios