Asianet News TeluguAsianet News Telugu

జగన్ మావాడే, 100కు 150 మార్కులు వేస్తా : జేసీ సెటైర్లు

జగన్ ఏంచేయాలో తోచక కిందామీద పడుతున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 100రోజుల పాలనకు 150మార్కులు వేయోచ్చు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇకపోతే తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని ఆరోపించారు. 
 

tdp ex mp jc diwakarreddy satirical comments on cm ys jagan
Author
Amaravathi, First Published Oct 23, 2019, 1:24 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. పాలనాపరంగా జగన్ కు అనుభవం లేదని విమర్శించారు. 

జగన్ ఏంచేయాలో తోచక కిందామీద పడుతున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనకు సంబంధించి100కు 150మార్కులు వేయోచ్చు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇకపోతే తన బస్సులనే భూతద్దంలో చూసి సీజ్ చేశారని ఆరోపించారు. 

ఇప్పటి వరకు 31 బస్సులను సీజ్ చేశారని చెప్పుకొచ్చారు. బస్సులను సీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులను సీజ్ చేసినందుకు గానూ న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు.   

చిన్న చిన్న లోటుపాట్లు ఆర్టీసీతో సహా ఏ ట్రావెల్స్‌కైనా సహజమేనని చెప్పుకొచ్చారు. ఫైన్‌లతో పోయే తప్పిదాలను సీజ్ చేయడం ఎంతవరకు సబబు అని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆర్టీఏ అధికారులను నిలదీశారు. 

ఇకపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పుడు ఎప్పుడూ మా అబ్బాయేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ మావాడేనని పదేపదే చెప్పుకుంటున్నారు జేసీ దివాకర్ రెడ్డి. అయితే ఈ సారి జగన్ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తానంటూ పంచ్ లు వేశారు. 

ఇటీవలే సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. జగన్ కు పరిపాలనా అనుభవం లేదని విమర్శించారు. జగన్ కు మంచి చెడు చెప్పేవాళ్లే లేరని అందువల్లే ఆయన  మెుండిగా వెళ్తున్నారని విమర్శించారు. 

అంతేకాదు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న చందంగా పరిపాలన సాగిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఆ మెుండి తనమే జగన్ కు మంచి చెడూ రెండూ తెచ్చిపెడుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే ప్రధాని నరేంద్ర మోదీ దయ వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజార్టీతో గెలిచారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మోదీ చేతుల్లో ఉన్న మంత్ర దండం షిర్డి సాయి కన్నా శక్తివంతమైనదంటూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. 
 

ఈ వార్తలు కూడా చదవండి

జేసీ బ్రదర్స్ కు జగన్ సర్కార్ షాక్: దివాకర్ ట్రావెల్స్ సీజ్

అనుభవం లేదు, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అంటున్నాడు: జగన్ పై జేసీ ఫైర్

బీజేపీతో టీడీపీ లింక్స్: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us:
Download App:
  • android
  • ios