Woman

ముఖానికి టమాటా పెడితే ఏమౌతుందో తెలుసా

టమాటా ఫేస్ ప్యాక్

టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, లైకోపీన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని చలికాలంలో ముఖానికి పెడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. 

పెరుగు, టమాటా రసం

పెరుగులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి మన చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. టమాటా పేస్ట్ లో పెరుగును కలిపి ముఖానికి పెడితే ముఖంపై ఉన్న మచ్చలు పూర్తిగా పోతాయి. 

టమాటా ఫేస్ ప్యాక్

పసుపు మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ముఖ వాపును తగ్గించి, ఎరుపును తొలగిస్తుంది. టమాటా గుజ్జులో పసుపును కలిపి పెడితే మచ్చలు తగ్గిపోతాయి. 

టమాటా ఫేస్ ప్యాక్

 టమాటా గుజ్జులో శెనగపిండిని కలిపి ముఖానికి రాస్తే ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పూర్తిగా తొలగిపోతాయి. దీంతో మీ ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది. 

టమాటా తేనె ఫేస్ ప్యాక్

చలికాలంలో కూడా మీ ముఖం అందంగా ఉండాలంటే బాగా పండిన సగం టమాటా ముక్కలో ఒక చెంచా తేనె వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. 

టమాటా, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

మొటిమలను తగ్గించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిలో టమాటా రసం కలిపి ముఖానికి పెట్టండి.ఇది మచ్చలను పోగొట్టడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

Find Next One