కలంకారీ అనేది ఒక ప్రాచీన పెయింటింగ్ కళ. దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందిన ప్రాచీన వస్త్ర ముద్రణ కళ గా చెబుతారు.
కలంకారీ చీరలు ఎప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ మల్టీ కలర్ కలంకారీ ప్రింట్ చీరలు ధరించడానికి యువతులు ఇష్టపడతారు. ఇవి చాలా రంగురంగులగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
కాటన్‌తో పాటు జార్జెట్, సిల్క్ వస్త్రాలలో కూడా కలంకారీ ప్రింట్ చీరలు లభిస్తాయి. పెళ్లిళ్ల సీజన్‌లో లేదా పండుగల సమయంలో వీటిని ధరించవచ్చు.
మెరూన్ ప్లెయిన్ చీరకు బోర్డర్‌పై కలంకారీ ప్రింట్ అందాన్ని రెట్టింపు చేస్తుంది. దీనితో పాటు కలంకారీ బ్లౌజ్ మొత్తం లుక్‌ను మరింత అందంగా మారుస్తుంది.
వివిధ రంగుల ప్రింట్‌లతో అలంకరించబడిన కలంకారీ చీరను ఫ్యూజన్ లుక్ కోసం ఇలా స్టైల్ చేయవచ్చు. చీర పల్లూను డ్రేప్ చేసి బెల్ట్ పెట్టుకోండి.
కలంకారీ చీర ధర 1000 నుండి 30 వేల వరకు ఉంటుంది. కస్టమైజ్ చేయించుకుంటే ధర మరింత పెరుగుతుంది.