Woman

ఈ చీరలు కట్టుకుంటే బంగారు నగలు వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు

జార్జెట్ బంగారు చీర

లైట్ వెయిట్ గోల్డ్ కలర్ లో ఉండే జార్జెట్ చీరను కట్టుకుంటే మీరు ఎంతో అందంగా ఉంటారు. ఈ చీరమీదికి మీరు బంగారు నగలను వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. 

సీక్విన్ బంగారు చీర

మీరు కొంచెం మెరిసే లుక్ ను కోరుకుంటే మాత్రం సెక్విన్ బంగారు చీరను కట్టుకోండి. ఇది స్పెషల్ సందర్భానికి బాగా సూట్ అవుతుంది. దీనికి మీరు ఎలాంటి నగలను వేసుకోవాల్సి న అవసరమే ఉండదు.

మెరిసే బంగారు రంగు చీర

నిజానికి ఈ చీరలు చాలా తేలికగా ఉంటాయి. కానీ వీటిలో మీ లుక్ బాగుంటుంది. స్పెషల్ గా కనిపించాలనుకుంటే ఈ చీరను ట్రై చేయండి. నార్మల్ ఇయర్ రింగ్స్ తో మీరు రెడీ అయితే బ్యూటీఫుల్ గా ఉంటారు. 

ఎంబ్రాయిడరీ చీర

ఆకాశంలోని నక్షత్రాల లాగ కనిపించే ఈ చీరలో కూడా మీ లుక్ వావ్ అనిపిస్తుంది. ఈ బంగారు రంగు చీరను కట్టుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. ఈ చీర మీదికి  నగలను పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. 

కాంజీవరం బంగారు చీర

కాంజీవరం చీరలో మీరు మరింత అందంగా కనిపిస్తారు. దీనికి మీరు డిజైన్ల నగలు లేకున్న కూడా గ్రాండ్ గా క్లాసిక్  లుక్ లో కనిపిస్తారు. అయితే బంగారు నగలకు బదులుగా ఈ రకమైన నగలను వేసుకోవచ్చు. 

టిష్యూ సిల్క్ బంగారు చీర

గోల్డెన్ టిష్యూ సిల్క్ చీరలో మీరు రాయల్ గా, క్లాసీగా కనిపిస్తారు. దీనిని మీరు నార్మల్ జాకెట్ తో స్టైల్ చేయొచ్చు.

ప్రింటెడ్ బంగారు చీర

బంగారు రంగులో ఉన్న చీరపై ప్రింట్ మిమ్మల్నిమరింత అందంగా కనిపించేలా చేస్తుంది.  ఇలాంటి చీరను కట్టుకుంటే మీరు బంగారు నగలను ధరించాల్సిన అవసరం రాదు.పెళ్లిళ్లకు ఇది బాగా సూట్ అవుతుంది

బనారస్ బంగారు చీర

హెవీ బ్రోకేడ్ వర్క్ ఉన్న ఈ బంగారు రంగు చీర మీకు రాయల్, సాంప్రదాయ లుక్ ను ఇస్తుంది. దీనిపైకి మీరు  తేలికపాటి నగలను వేసుకున్న అందంగా కనిపిస్తారు. 

ఎలాంటి చీరకు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలో తెలుసా?

ఈ చిట్కాలు ఫాలో అయితే ..మీ నడుము సైజు, బరువు తగ్గడం పక్కా

మీరు వాడే నీళ్లే.. మీ జుట్టు రాలడానికి కారణమా?

నల్లబడిన బంగారు నగలు కొత్తవాటిలా మెరవాలంటే ఇలా చేయండి