Woman

ఏం తింటే.. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది

Image credits: Getty

గుడ్డు

గుడ్డు మంచి పోషకాహారం. దీనిలో మన జుట్టు బలంగా పెరిగేందుకు అవసరమైన బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే మీరు రోజూ ఒక గుడ్డును తింటే మీ జుట్టు బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

చికెన్

చికెన్ లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని డైట్ లో చేర్చుకున్న జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. అలాగే జుట్టు మంచి షైనీగా కూడా ఉంటుంది. 

Image credits: Getty

గ్రీక్ పెరుగు

గ్రీక్ పెరుగులో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పెరుగు టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పెరుగును రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది. వెంట్రుకలు ఊడిపోవు.

Image credits: Getty

నట్స్,సీడ్స్

 నట్స్, సీడ్స్ లో మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. మీరు గనుక రోజూ కొన్ని చియా సీడ్స్, బాదం,పల్లీలు వంటి ప్రోటీన్ ఫుడ్స్ ను తింటే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 

Image credits: Getty

పప్పు ధాన్యాలు

పప్పు ధాన్యాలు ప్రోటీన్ కు మంచి వనరులు. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది. వెంట్రుకలు పొడుగ్గా పెరుగుతాయి. 

Image credits: Getty

తోటకూర

తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తిన్నా జుట్టు బలంగా, నల్లగా, పొడుగ్గా పెరుగుతుంది. 

Image credits: Getty

చీజ్

చీజ్ లో కాల్షియం, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. నిపుణుల ప్రకారం.. చీజ్ ను డైట్ లో చేర్చుకుంటే జుట్టు హెల్తీగా ఉంటుంది. 

Image credits: Getty

చలికాలంలో డ్రై స్కిన్ ప్రాబ్లం రాకూడదంటే?

ఆడవాళ్లకు షుగర్ ఉంటే ఏమౌతుందో తెలుసా

ముఖానికి రోజూ రోజ్ వాటర్ రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే

40 ఏళ్లు దాటిన స్త్రీలు ఇవి తప్పకుండా తినాలి