Woman
వెండి ఆభరణాలను రోజూ పెట్టుకోవడం వల్ల అవి తొందరగా నల్లబడుతుంటాయి. కానీ కొన్నింటితో వీటిని కొత్తవాటిలా, మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే?
వెండి గొలుసులు, పట్టీలు, మెట్టెలను రోజూ పెట్టుకోవడం వల్ల అవి మురికిగా, నల్లగా అవుతాయి. అయితే మీరు వీటిని నిమిషాల్లోనే మెరిసేలా చేయొచ్చు.
అవును టీ పొడితే నిమిషంలోనే వెండి పట్టీలను తెల్లగా చేయొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో 1 కప్పు నీళ్లను తీసుకుని వేడి చేయండి.
దీనిలో అర టీస్పూన్ టీ పొడిని వేసి మరిగించండి. దీనిలోనే అర టీస్పూన్ డిటర్జెంట్ పౌడర్ ను కలపండి. ఇది మరిగిన తర్వాత దీనిలో పట్టీలు లేదా మెట్టెలను వేయండి.
2 నిమిషాలు ఈ నీళ్లు మరిగిన తర్వాత మంట ఆపేసి ఇప్పుడు వీటిని కొద్దిసేపు క్లీన్ చేయండి. అంతే వెండి ఆభరణాలకు పట్టిన నలుపు మొత్తం పోతుంది.
ఇంతే చాలా సింపుల్ గా మీరు ఇంట్లోనే పట్టీలను, మెట్టెలను, వెండి గొలుసులను, వెండి వస్తువులను కొత్తవాటిలా, మెరిసేలా చేయొచ్చు.
వయసు పెరిగినా, జుట్టు నల్లగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
రాఖీ శుభాకాంక్షలు ఇలా చెప్పండి: బెస్ట్ కోట్స్ మీకోసం..
ధర తక్కువ.. ప్రేమ ఎక్కువ: 1000 లోపు బెస్ట్ రాఖీ గిఫ్ట్స్
చీరలో చందమామలా నిధి.. క్రేజీ కలెక్షన్