Woman

వయసు పెరిగినా, జుట్టు నల్లగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

ఆమ్లా ఆయిల్

ఉసిరి( ఆమ్లా) జుట్టుని నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరి, కొబ్బరి నూనెను కలిపి మిశ్రమాన్ని తయారు చేసి, జుట్టుకి పట్టించి మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగాలి.

కరివేపాకు నూనె

కరివేపాకులో ఉండే గుణాలు జుట్టుకి సహజ రంగును అందిస్తాయి. కరివేపాకును కొబ్బరి నూనెలో మరిగించి చల్లార్చండి. ఈ నూనెను జుట్టుకి పట్టించి మసాజ్ చేయండి. కొంత సమయం తర్వాత కడగాలి.

ఉల్లి రసం

ఉల్లి రసం జుట్టు తెల్లబడటం సమస్యను తగ్గిస్తుంది. ఉల్లిపాయను తురిమి రసం తీయండి. ఈ రసాన్ని జుట్టుకి పట్టించి 30-45 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి.

మెహందీ , కాఫీ

మెహందీ , కాఫీ పేస్ట్ కూడా జుట్టుని నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. మెహందీలో కొంచెం కాఫీ కలిపి నీటితో కలిపి పేస్ట్ చేయండి. దీన్ని జుట్టుకి పట్టించి 2-3 గంటల తర్వాత కడగాలి.

నువ్వులు , అవిసె గింజలు

నువ్వులు , అవిసె గింజలను కలిపి పొడి చేయండి. ఈ పొడితో పేస్ట్ చేసి జుట్టుకి పట్టించండి. తర్వాత కడగాలి. ఇది జుట్టుని నల్లగా , బలంగా ఉంచుతుంది.

టీ నీరు

టీ నీరు కూడా జుట్టుని నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. టీని నీటిలో మరిగించి చల్లార్చిన తర్వాత జుట్టుకి పట్టించండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి. 

కరివేపాకు , పెరుగు

కరివేపాకు పేస్ట్ తయారు చేసి, దానిలో పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించండి. 30-40 నిమిషాల తర్వాత కడగాలి. ఇది జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా, మెరిసేలా చేస్తుంది.

బంగాళదుంప తొక్కల నీరు

బంగాళదుంప తొక్కలను మరిగించి ఆ నీటిని జుట్టుకి పట్టించండి. ఇది జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా, సహజ రంగును అందిస్తుంది.

రాఖీ శుభాకాంక్షలు ఇలా చెప్పండి: బెస్ట్ కోట్స్ మీకోసం..

ధర తక్కువ.. ప్రేమ ఎక్కువ: 1000 లోపు బెస్ట్ రాఖీ గిఫ్ట్స్

చీరలో చందమామలా నిధి.. క్రేజీ కలెక్షన్

ముక్కు పుడకను ఎడమ వైపే ఎందుకు పెట్టుకుంటారో తెలుసా