Woman

ముఖం నిండా మొటిమలు, నల్ల మచ్చలు.. ఆ మేకప్ వేసుకుంటే జరిగేది ఇదే

రంధ్రాలు మూసుకుపోతాయి

లాంగ్ లాస్టింగ్ మేకప్ లో ఉండే పదార్థాలు చర్మ రంధ్రాలను మూసేసి నూనె, చెమట బయటకు రాకుండా చేస్తాయి. దీంతో ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి. 

చర్మం పొడిబారుతుంది

లాంగ్ లాస్టింగ్ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఆల్కహాల్ తో పాటుగా డ్రైయింగ్ ఏజెంట్లు కూడా ఉంటాయి. ఇవి మన చర్మం పొడిబారేలా చేస్తాయి. దీనివల్ల ముఖంపై ముడతలు ఏర్పడే అవకాశం ఉంది.

చర్మ అలెర్జీ

దీర్ఘకాల మేకప్‌లో ఉండే సువాసనలు,పారాబెన్స్, ప్రిజర్వేటివ్స్ వంటి రసాయనాలు చర్మానికి అస్సలు మంచివి కావు.వీటివల్ల చర్మం దురదపెట్టడం, ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తాయి.

త్వరగా వృద్ధాప్య ఛాయలు

లాంగ్ లాస్టింగ్ మేకప్ ను వాడటం వల్ల చర్మానికి గాలి అందదు. దీనివల్ల  ముఖంపై ముడతలు ఏర్పడతాయి. చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో మీరు తొందరగా ముసలివాళ్లలాగ కనిపిస్తారు.

జుట్టు కుదుళ్లకు నష్టం

లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ లేదా పౌడర్ మన ముఖ వెంట్రుకల్లో చిక్కుకుంటుంది. ఇది ముఖం మీదున్న చిన్న చిన్న వెంట్రుకలు రాలిపోయి చర్మం దెబ్బతింటుంది. 

కళ్లకు నష్టం

లాంగ్ లాస్టింగ్ మస్కారా, ఐలైనర్‌ల్లో హానికరమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి కళ్లలో మంట, కనురెప్పలు రాలిపోవడం, కళ్లు ఎర్రబడటం వంటి సమస్యలు దారితీస్తాయి. 

పెదవులు పొడిబారడం, నల్లబడడం

లాంగ్ లాస్టింగ్ లిప్ స్టిక్ లో ఉండే కెమికల్స్ వల్ల పెదవులు నల్లబడతాయి. అలాగే పెదాలు పొడిబారి పగులుతాయి. ఇది పెదవుల సహజ అందాన్ని పాడు చేస్తుంది.

ఈ ఒక్కటి పెట్టినా మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి

రిమూవబుల్ ప్యాడెడ్ బ్లౌజ్ లు ఎందుకు వాడాలో తెలుసా?

ఈ నీళ్లను వాడితే.. జుట్టు ఊడిపోదు, పొడుగ్గా పెరుగుతుంది

2024లో ట్రెండీ మంగళసూత్రాల డిజైన్స్