Telugu

ఈ నీళ్లను వాడితే.. జుట్టు ఊడిపోదు, పొడుగ్గా పెరుగుతుంది

Telugu

రైస్ వాటర్

రైస్ వాటర్ లో ఉండే లక్షణాలు మన జుట్టును ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది. అసలు రైస్ వాటర్ తో మన జుట్టుకు కలిగే లాభాలేంటంటే?

Image credits: Freepik
Telugu

బలమైన జుట్టు

రైస్ వాటర్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును బలంగా ఉంచుతాయి. అలాగే వెంట్రుకలు తెగిపోకుండా కాపాడుతాయి. 

Image credits: stockphoto
Telugu

జుట్టు బాగా పెరుగుతుంది

రైస్ వాటర్ లో జుట్టును పొడుగ్గా పెంచే పోషకాలు మెండుగా ఉంటాయి. రైస్ వాటర్ లోని పోషకాలు మన జుట్టుకు మంచి పోషణను అందించి తలలో రక్త ప్రసరణను పెంచుతాయి. జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 

Image credits: Our own
Telugu

జుట్టు మెరుపు

రైస్ వాటర్ లో ఉండే లక్షణాలు మన జుట్టును స్మూత్ గా చేస్తాయి. మీరు ఈ వాటర్ ను తరచుగా వాడితే గనుక మీ జుట్టు మంచి షైనీగా మెరుస్తుంది. 

Image credits: Our own
Telugu

జుట్టు రక్షణకు

రైస్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును ఎండ నుంచి, కాలుష్యం నుంచి రక్షిస్తాయి. 

Image credits: Getty
Telugu

తలకు తేమ

రైస్ వాటర్ ను వాడితే తల పొడిబారే అవకాశం ఉండదు. అలాగే నెత్తిమీద దురద, చికాకు తగ్గతాయి. ఈ వాటర్ నెత్తిని తేమగా ఉంచి జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. 

Image credits: google

2024లో ట్రెండీ మంగళసూత్రాల డిజైన్స్

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలా? ఇవి రాస్తే చాలు

మహిళలకు మాధురీ దీక్షిత్ సక్సెస్ టిప్స్

త్రిష బ్యూటీ సీక్రెట్ ఇదే..!