Woman
అబ్బాయిల కంటే అమ్మాయిలకే మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి. హార్మోర్ల మార్పులు, చర్మ సంరక్షణ లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల మొటిమలు అవుతాయి.
అయితే మన ఇంటి చుట్టు ముట్టే ఉండే కొన్ని ఔషద మొక్కలు ఈ మొటిమలను తొందరగా తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వేపాకు మొటిమలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలు తగ్గేలా చేస్తాయి. ఇందుకోసం వేపాకు పేస్ట్ ను మొటిమలకు రాయాలి.
కలబంద ప్రతి ఇంట్లో దొరుకుతుంది. ఇది ఎలాంటి చర్మ సమస్యనైనా ఫాస్ట్ గా తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం కలబంద జెల్‌ను మొటిమలకు అప్లై చేయాలి.
పసుపుతో కూడా చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బాక్టీరియాను చంపుతుంది. ఇందుకోసం మొటిమలపై పసుపు రాసుకోవాలి.
రోజ్మేరీ ముఖంపై మురికి, బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుంది. అలాగే ముఖంపై నూనె ఉత్పత్తిని తగ్గించి మొటిమలు ఏర్పకుండా చేస్తుంది. రోజ్మేరీ ఆకులను మరిగించిన నీటితో ముఖం కడుక్కోండి.