Woman

సమంత కట్టుకున్న ఇలాంటి చీరల్లో మీ లుక్ వావ్.. రేట్ కూడా తక్కువే

సమంత చీరల కలెక్షన్

మళ్లీ పెళ్లిళ్ల సీజన్ మొదలైనట్టే. ఇంకేముంది ఆడవారు తక్కువ ఖర్చులో అందమైన చీరలను కొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వారు సమంత ధరించిన చీరలను ట్రై చేయొచ్చు.

ఐవరీ చీర డిజైన్

ప్రస్తుతం పాస్టెల్ కలర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ తెల్లని చీరమీదికి గోల్డ్ కలర్ బ్లౌజ్ బాగుంటుది. దీన్ని మీరు చాలా తక్కువ నగలతో ట్రై చేయండి.

సింపుల్ ప్రింటెడ్ చీర

సమంత కట్టుకున్న ఇలాంటి చీర వెయ్యి లోపే దొరుకుతుంది. దీని మీదికి మీరు ఆక్సిడైజ్డ్ నగలు, కొత్త హెయిర్ స్టైల్ ను ట్రై చేస్తే మీ లుక్ అదిరిపోతుంది. 

డిజైనర్ బ్లాక్ చీర

పార్టీలకి ఇలాంటి చీర లుక్ అదిరిపోతుంది. వైట్ బనారస్ బ్లౌజ్, బెల్ట్ తో సమంత ఈ చీరలో ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే మీరు ఈ చీర మీదికి స్లీవ్ లెస్ బ్లౌజ్ ను వేసుకోవచ్చు.

ఫ్యాన్సీ సిల్క్ చీర

ఫ్యాన్సీ చీరల వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ చీరలు పెళ్లిళ్లకు, పండుగలకు బాగుంటాయి. మీరు బోరింగ్ డిజైన్లు వద్దనుకుంటే సమంత కట్టుకున్న ఇలాంటి గోల్డ్ వర్క్ చీరను ట్రై చేయండి.

రెడ్ బనారస్ చీర

బనారస్ చీరలు మీ అందాన్ని మరింత పెంచేస్తాయి. సమంత కట్టుకున్న ఈ చీర మీకు మార్కెట్ లో కేవలం 1500-2000 లోపే దొరుకుతుంది. ముత్యాల నగలు వేసుకుంటే మీ లుక్ వావ్ అనిపిస్తుంది. 

గోల్డ్ చీర డిజైన్

గోల్డ్ కలర్ చీరలు పార్టీలకు చాలా బాగుంటాయి. ఈ చీరలు మీ బడ్జెట్ లోనే దొరుకుతాయి. అయితే ఈ చీరను వేరే కలర్ బ్లౌజ్ తో ట్రై చేయాలి. దీని మీదికి తక్కువ నగలు వేసుకోవాలి.

రూ.100 కే ఇంత మంచి పట్టీలు వస్తాయా

మహిళల్లో నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

వెండి మంగళసూత్రాలు..అదిరిపోయే డిజైన్లు

జస్ట్ రూ. 500 లకే బంగారం లాంటి ఉంగరాలు